- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IRCTC Tour package: అరుణాచలం వెళ్తున్నారా? మీ కోసమే ఈ సూపర్ న్యూస్!
సౌత్ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అరుణాచలానికి ప్రత్యేకస్థానం ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: సౌత్ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అరుణాచలానికి (Arunachalam) ప్రత్యేకస్థానం ఉంటుంది. అక్కడి ఆలయంలోని పరమశివుణ్ణి దర్శించుకోవాలని దేశ నలుమూలల నుంచి భక్తులు ఎదురుచూస్తుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు తరలివెళ్తుంటారు. ఈ సందర్భంగా అరుణాచలం వెళ్లాలనుకునే భక్తుల (Devotees) కోసం IRCTC సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. 'అరుణాచలం మోక్ష యాత్ర (ARUNACHALA MOKSHA YATRA)' పేరుతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగే ఈ యాత్రలో అరుణాచలంతో పాటు కాంచీ కామాక్షి అమ్మవారి దర్శనం, పుదుచ్చేరిలోని ప్రకృతి అందాలు చుట్టి రావచ్చు. జూన్ 19 నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రతి గురువారం ఈ యాత్ర ట్రైన్ అందుబాటులో ఉంటుంది. టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
టూర్ ప్లాన్:
కాచిగూడలో ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకు (కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 17653) రైలు అందుబాటులో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. అక్కడే హోటల్‌లో చెకిన్, ఫ్రెష్ అప్ అయ్యాక.. అరోవిల్ (Auroville), అరబిందో ఆశ్రమం, బీచ్ వీక్షిస్తారు. రాత్రి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది. మూడో రోజు ఉదయం టిఫెన్ చేసి హెటల్ నుంచి చెక్ అవుట్ అయి తిరువణ్ణామలై చేరుకుని అరుణాచలేశ్వరుడి దర్శనం జరుగుతుంది. ఆ రాత్రి అక్కడే బస ఉంటుంది. నాలుగో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి కాంచీపురానికి బయల్దేరుతారు. అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయాన్ని, ఏకాంబరేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత చెంగల్పట్టు స్టేషన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:35 గంటలకు రైలులో తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఐదో రోజు ఉదయం 7:50 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.
ప్యాకేజ్ ఛార్జీలు:
* కంఫర్ట్ క్లాస్ (థర్డ్ ఏసీ బెర్త్)లో ఒకరి నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి బుక్ చేసుకుంటే.. డబుల్ షేరింగ్‌కు రూ.20,060, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,610లు ఉండగా.. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ కు రూ.11,750, వితౌట్ బెడ్‌కు రూ.9,950గా నిర్ణయించారు. అదే నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు కలిసి బుక్ చేసుకుంటే డబుల్ షేరింగ్‌కు రూ.16,390, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,110 చెల్లించాలి.
* స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్) డబుల్ షేరింగ్‌కు రూ.17,910, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,460గా నిర్ణయించగా.. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ రూ.9,590, విత్ అవుట్ బెడ్ రూ.7,800 చెల్లించాలి.
ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు:
* ఎంచుకున్న ప్యాకేజీపై ఆధారపడి.. రైలులో థర్డ్ ఏసీ , స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది.
* ప్యాకేజీని బట్టి సైట్ సీయింగ్ కోసం ట్రావెల్ వెహికల్.
* హోటల్‌లో వసతి ఏర్పాటు, ఉచితంగా అల్పాహారం.
* యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
* పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే సందర్శకులే చెల్లించాలి.
* పూర్తి వివరాలు, టికెట్లు బుకింగ్ కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్‌ను సంప్రదించండి.






