- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మగా ఉందని ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా.?
ఎనర్జీ డ్రింక్స్ ఎంత డేంజరో తాజా పరిశీలనలు చెప్తున్నాయి.

ఎనర్జీ డ్రింక్స్ అంటే పిల్లలు లొట్టలేసుకొని తాగుతారు.
పేరెంట్స్ కూడా బలం వస్తుందేమో.. శక్తినిస్తాయేమో అని వద్దని చెప్పరు.
కానీ ఎనర్జీ డ్రింక్స్ ఎంత డేంజరో తాజా పరిశీలనలు చెప్తున్నాయి.
- దిశ, ఫీచర్స్
బానిస అవుతున్నారు: ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్.. టౌరిన్ అధికంగా ఉంటాయి. వీటిని పిల్లలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వాటిలో ఉండే కెఫిన్ వల్ల పిల్లలు ఈ డ్రింక్స్‌కు బానిసవుతున్నారు.
మూడు రెట్ల అధికం: ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ స్థాయిలు సాధారణ ఎరేటెడ్ కోలాస్ కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. పరిమితి కన్నా మించిపోయి ఉన్నాయి. కాబట్టి అవి పిల్లలకు హాని చేస్తాయి.
వారికి అమ్మొద్దు: కొన్ని దేశాలలో ఈ ఎనర్జీ డ్రింక్స్ 15 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు అమ్మరాదనే నిబంధన ఉంది. వాటిలో ఉండే కెఫిన్.. టౌరిన్ శాతమే దీనికి కారణం. అదే పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది.
వ్యసనం: స్ట్రాబెర్రీ క్యాండీల మాదిరి స్ట్రాబెర్రీ క్విక్ డ్రింక్స్ వస్తు్న్నాయి. ఇలాంటివి తాగితే పాఠశాల స్థాయిలోనే మాదకద్రవ్యాల వ్యసనం ప్రారంభం అవుతుంది.
గుండె సమస్యలు: మార్కెట్లో లభ్యమయ్యే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది పిల్లల హార్ట్ రేట్ పెరుగుదల.. ఆందోళన.. గ్యా్స్ట్రిక్ సమస్యలు.. గుండె ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలకు దారితీస్తాయి.
హెచ్చరిక: తీవ్రమైన సమస్యలకు కారణమవుతున్నాయి కాబట్టే ఎనర్జీ డ్రింక్స్‌ను 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు వీటిని తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందంటే వాటివల్ల కలిగే సమస్యలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.
మరేం తీసుకోవాలి: ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు లస్సీ.. నిమ్మరసం.. పళ్ల రసాలు.. మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు వంటి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. బజ్రా.. కాంగ్ని.. కోద్రా.. జోవర్.. సాన్వాన్.. రాగి వంటి మిల్లెట్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.
నీరు ఆదా: శారీరక.. మానసిక ఆరోగ్యానికి మిల్లె్ట్స్ వంటి హెల్దీ ఫుడ్ చాలా అవసరం. వీటిని పండించడం వల్ల నీరు ఆదా అవుతుంది. ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలకు ఇచ్చిన వాళ్లం అవుతాం.
అవగాహన: ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా పోషకాలు పుష్కలంగా ఉండే ధాన్యాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి. మాదకద్రవ్య వ్యసనానికి సంబంధించిన సమస్యలను ప్రాథమిక స్థాయి నుంచే పరిష్కరించాలి.






