- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Alert : డివోర్స్ తీసుకుంటున్నారా..? అయితే మీ పిల్లలకు ఆ రిస్క్ ఎక్కువే
మీరు డివోర్స్(Divorce) తీసుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఇది వినండి.

దిశ, వెబ్ డెస్క్ : మీరు డివోర్స్(Divorce) తీసుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఇది వినండి. తల్లిదండ్రులు(Parents) విడాకులు తీసుకుంటే వారి పిల్లల్లో గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు. కెనెడా(Canada)లోని ఓ అంతర్జాతీయ యూనివర్సిటీ అధ్యయనంలో.. 65 ఏళ్లు దాటిన 13 వేల మందిపై సర్వే నిర్వహించారు. 18 ఏళ్లలోపు వయసులో వారి తల్లిదండ్రులు విడిపోవడం చూసి, ఆ బాధను అనుభవించిన వారిలో 60 శాతం మందికి గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించారు. అంతేకాదు వారు డిప్రెషన్, డయాబెటిక్, బీపీలతోపాటు అనేక మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీటన్నిటితో పాటు అనేకమందిలో గుండెపోటు సమస్య ఎక్కువగా వచ్చినట్టు వర్శిటీ పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు. సో.. మీరు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం భవిష్యత్తులో మీ పిల్లలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉండనుంది కాబట్టి, మరోసారి ఆలోచించుకోండి అంటున్నారు వారు.






