- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికెన్ తింటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి !
మటన్ ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం జనాలు చికెన్ కొనుగోలు

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ ఆరోగ్యం పట్ల ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ విపరీతంగా తిని అనారోగ్యం పాలవుతున్నారు. ఇక మరికొంతమంది ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తరచూ చికెన్ తినేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.
మటన్ ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం జనాలు చికెన్ కొనుగోలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చికెన్ వండుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే, ఎలాంటి రోగాలు రావని చెబుతున్నారు వైద్యులు. చికెన్ షాప్ నుంచి తీసుకువచ్చిన మాంసాన్ని వండేటప్పుడు, కచ్చితంగా ఒకసారి ఉప్పుతో కడగాలని సూచిస్తున్నారు. దానివల్ల చికెన్ పైన ఉన్న క్రిములు, ముఖ్యంగా బ్యాక్టీరియా చనిపోతుందట. అప్పుడు చికెన్ ఫ్రెష్ గా ఉంటుందని చెబుతున్నారు. అలా తినడం వల్ల స్కిన్ ఎలర్జీ, జుట్టు రాలడం, చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చట.
అలాగే స్కిన్ తో కాకుండా స్కిన్ లెస్ చికెన్ మాత్రమే తినాలని చెబుతున్నారు వైద్యులు. ఇక చికెన్ కనీసం 74 డిగ్రీల వరకు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ వేడికి బ్యాక్టీరియా చనిపోతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే చికెన్ కడగకపోతే, ఎక్కువసేపు ఉడికిస్తే సరిపోతుందని కూడా వైద్యులు సూచనలు చేస్తున్నారు. మటన్ కంటే చికెన్ తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి చికెన్ ఎలాంటి వయసు ఉన్న వారైనా చికెన్ తినవచ్చని స్పష్టం చేస్తున్నారు.






