- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ మందిర నిర్మాణానికి విరాళం ఇస్తున్నారా.. భక్తులు జర జాగ్రత్త!
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది రామ భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది రామ భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక భారతీయుల కల.. నెరవేరేందుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు.
అయితే ఇప్పటికే రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభం కాగా. కోట్లలో విరాళాలు కూడా వచ్చాయి. ఇటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు లక్షల్లో విరాళాలు ఇచ్చారు. అంతే కాదు సామాన్య ప్రజలు కూడా వెబ్ సైట్ ల ద్వారా, చందాల ద్వారా విరాళాలు ఇస్తున్నారు.
కానీ రామ భక్తులు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ఆలయ నిర్మాణానికి విరాళాలంటూ నకిలీ క్యూఆర్ కోడ్లను సోషల్ మీడియాలో పెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. ఫోన్లు చేయడంతోపాటు వాట్సాప్ లో మెసేజ్ పంపుతున్నారు. తాజాగా ఇలా కొన్ని నకిలీ వెబ్ సైట్ల లను కూడా పోలీసులు గుర్తించారు. జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు.






