- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు మంచి కొడుకువేనా? ఇలా కాలిక్యులేట్ చేసుకో..
మన తల్లిదండ్రులు వారి సుఖాలను పక్కనపెట్టి మనకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఎన్ని కష్టాలొచ్చినా తమ బిడ్డలకు మాత్రం బాధ రుచి చూపకూడదని అనుకుంటారు. కానీ పెరిగాక మన పేరెంట్స్‌కు మనం మంచి కొడుకుగా ఉంటున్నామా?

దిశ, ఫీచర్స్ : మన తల్లిదండ్రులు వారి సుఖాలను పక్కనపెట్టి మనకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఎన్ని కష్టాలొచ్చినా తమ బిడ్డలకు మాత్రం బాధ రుచి చూపకూడదని అనుకుంటారు. కానీ పెరిగాక మన పేరెంట్స్‌కు మనం మంచి కొడుకుగా ఉంటున్నామా? వారికి అవసరమైనప్పుడు సహాయంగా ఉండటం, కలిసి టైమ్ స్పెండ్ చేయడం, మన కోసం చేసే పనులను చూసి అభినందించి మురిసిపోవడం... ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా మీ ప్రేమ, మీరు వారిపట్ల చూపుతున్న శ్రద్ధ గురించి మాట్లాడుతాయి. నిజంగా మీరు మంచి కొడుకేనా కాదా ఇలా తెలుసుకోండి.
1. అన్ని విషయాల్లో హెల్ప్
ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేయడం, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో బాధ్యత తీసుకోవడం, పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు వారితో నిలబడటం.. ఇవన్నీ మీపై మీ పేరెంట్స్‌కు నమ్మకాన్ని పెంచుతాయి. నా కొడుకు ఉన్నాడు కదా భవిష్యత్తు అంతా బాగుంటుంది.. వృద్ధాప్యంలోనూ ఎలాంటి బాధలుండవనే భరోసా ఇస్తాయి. కొడుకుపై ఆధారపడొచ్చనే విశ్వాసాన్ని కలిగిస్తాయి.
2. అభిప్రాయాలకు విలువ
తల్లిదండ్రులకు చాలా జీవిత అనుభవం ఉంటుంది. ప్రతిసారి ఫాలో కాకపోయినా వారి సలహాలను వినడం గౌరవాన్ని చూపుతుంది. మీరు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడినా.. వారి అభిప్రాయాలను పూర్తిగా వినేందుకు సమయం కేటాయించడంలోనే మార్కులు కొట్టేస్తారు. మీరు మీ తల్లిదండ్రుల కన్నా గొప్ప విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు కానీ కొడుకు తమ మాట విన్నాడనే ఒక ఆలోచన మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.
3. కనెక్ట్ అయి ఉండటం
మీ తల్లిదండ్రులకు మీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వడం ఆ బంధాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాల్ చేయడం, కొత్త విషయాలను పంచుకోవడం.. మీరు వారికి చాలా దగ్గరగా ఉన్నారనే భావన ఇస్తుంది. మీరు ఎంత ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారో... మీ సంబంధం అంత స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడూ ఇలాగే ఉండటం నమ్మకం, ప్రేమను పెంచడంలో సహాయపడుతుంది.
4. త్యాగాల గుర్తింపు
తల్లిదండ్రుల త్యాగాలు గుర్తించడం.. చిన్న బహుమతిని అందించడం.. లేదా కృతజ్ఞతతో సింపుల్‌గా ధన్యవాదాలు తెలపడం.. మీ బంధాన్ని చాలా బలంగా మారుస్తుంది. ఇవి చాలా చిన్న విషయాలే అయినప్పటికీ.. కృతజ్ఞత తెలిపేందుకు సమయం కేటాయించడం వల్ల మీరు వారి త్యాగాలను గుర్తిస్తున్నారని తెలుస్తుంది. అది మీ సంబంధాన్ని బలపరుస్తుంది.
5. సమయం కేటాయింపు
ఈ బిజీ ప్రపంచంలో తల్లిదండ్రుల కోసం సమయం కేటాయించడం వారికి ప్రాధాన్యతనిచ్చినట్లుగా ఉంటుంది. టీ తాగుతూ మాట్లాడుకోవడం, లంచ్ లేదా డిన్నర్ స్పెషల్‌గా ప్లాన్ చేయడం, సర్‌ప్రైజ్ విజిటింగ్స్‌తో హ్యాపీగా ఉంచడం.. ఇలాంటి అంశాలు వారు మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది సూచిస్తాయి. నిజానికి మంచి కొడుకు అంటే 24 గంటలు చుట్టూ తిరగడం కాదు ఇలాంటి అర్థవంతమైన పనులు చేస్తూ.. తామున్నామని భరోసా ఇవ్వడమే.






