దోమల ద్వారా వచ్చే రోగాలకు గుడ్ బై.. ఇంట్లో ఈ మొక్కలు పెంచండి చాలు..!

by Javid Pasha |

లావెండర్, పుదీనా, రోజ్మెరీ, తులసీ వంటి మొక్కలను ఇంటి ముందు, చుట్టుపక్కల పరిసరాల్లో పెంచడంవల్ల దోమలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

దోమల ద్వారా వచ్చే రోగాలకు గుడ్ బై.. ఇంట్లో ఈ మొక్కలు పెంచండి చాలు..!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేక మందిని సీజన్ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎక్కువ శాతం వ్యాధులకు దోమ కాటు కూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అసలే వర్షాకాలం.. వీధుల్లో, రోడ్లపై నీరు నిలువడం, డ్రైనేజ్ లీకేజీలతో మురుగు పారడం వంటి కారణాలతో దోమల బెడద పెరిగిపోతోంది. దీంతో ప్రజలు దోమలను తరమేందుకు తరచుగా ఆల్ ‌ఔట్, కాయిల్స్ వంటివి వాడుతుంటారు. అవి పెద్దగా ప్రభావం చూపకపోగా, ఆరోగ్యానికి మంచిది కాదని కూడా నిపుణులు చెబుతుంటారు. అయితే అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి, దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి కొన్ని రకాల మొక్కలు మేలు చేస్తాయని ప్రకృ‌తి వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పెరట్లోనో, పరిసరాల్లోనో వాటిని పెంచడంవల్ల వాటిని దోమలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

పుదీనా, లావెండర్

లావెండర్ సువాసనగల మొక్క. దీనిని ఇంటిముందు, చుట్టుపక్కల పరిసరాల్లో పెంచడంవల్ల దోమలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే పుదీనా కూడా మంచి క్రిమి సంహారిణిగా పనిచేస్తుందట. ఇంటి ముందు కుండీల్లో పుదీనా మొక్కలు పెంచినట్లయితే ఇంటి అవసరాలకు ఉపయోగపడటమేగాక, వివిధ రోగాలకు కారణమయ్యే దోమలు రాకుండా ఉంటాయి.

రోజ్మెరి, తులసీ

రోజ్మెరీ, తులసీ మొక్కలు ఉన్న పరిసరాల్లోకి కూడా దోమలు రావడానికి ఇష్ట పడవు. రోజ్మెరీ ఇంటి అందాన్ని, అలంకారాన్ని పెంచుతుందనే ఉద్దేశంతో నాటుతుంటారు. అంతేగాకుండా ఇది దోమలు రాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే దీని నుంచి వెలువడే వాసనను అవి తట్టుకోలేవు. ఇక తులసి మొక్క గురించి అందరికీ తెలిసిందే. మన దేశంలో దీనిని పవిత్రమైనదిగా భావిస్తూ పూజిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగుండటమేగాక, దానివాసన కారణంగా దోమల నివారణిగా కూడా పనిచేస్తుంది.

*గమనిక : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story