- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brown Rice : ముడి బియ్యం తింటున్నారా..? అయితే మీకు మూడినట్టే
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరిగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరిగిపోయింది. ఆరోగ్యం కోసం ఎన్ని తంటాలు అయినా పడేవాళ్ళు కోకొల్లలు. ఇక నోరు కట్టుకునే వాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు. అదేవిధంగా తినే ఆహారంలో రైస్ లేకుండా చూసుకొని మరీ సమతుల్య ఆహార నియమాలు పాటించేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. మరి రైస్ కు బదులు వీళ్ళు తీసుకునేది ఏమిటంటే బ్రౌన్ రైస్. అదే ముడి బియ్యం. ముడి బియ్యం తినడం వల్ల అందులో ఉండే పీచు (ఫైబర్) జీర్ణ వ్యవస్థను చక్కగా పనిచేసేలా చేస్తుంది అంటారు. ఇదిలా ఉంటే ముడి బియ్యం వలన కూడా ముప్పు ఉంటుందనే విషయాన్ని పరిశోధకులు తేల్చారు. ముడిబియ్యం పైపొరలో ఉండే ఆర్సెనిక్ అనే పదార్థంతో భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అంటున్నారు. అసలు ఈ ఆర్సెనిక్ రైస్ లోకి ఎలా వస్తుంది అంటే.. ప్రపంచంలో ఒక్కో నేలలో ఒక్కో స్థాయిలో ఆర్సెనిక్ ఉంటుంది. అది అక్కడ పండే పంటల్లో చేరుతుంది. వరిలో కూడా ఆర్సెనిక్ చేరుతుంది. ఇది కేవలం పొట్టు (బ్రాన్) కే పరిమితం కాదు, లోపల ఉన్న తెల్ల గింజలోనూ చేరుతుంది. అయితే పొట్టులో ఎక్కువ శాతంలో ఉంటుంది. పొట్టుని తొలగించడం వల్ల కొంత మేరకు ఆర్సెనిక్ ని తగ్గించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది 10% నుండి 40% వరకు ఉండవచ్చు. తెల్ల బియ్యంలో ఆర్సెనిక్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో చేరే ఆర్సెనిక్ స్థాయి ముడి బియ్యం తిన్నప్పుడు చేరే స్థాయికి దగ్గరగా ఉండవచ్చు. అయితే, ఇది ఆయా బియ్యం రకాల్లోని ఆర్సెనిక్ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముడి బియ్యం తినేవారు కూడా రైస్ బాగా కడిగిన తర్వాతే వండుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
గమనిక : పైవార్తలో సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు. ఇది కేవలం మీ అవగాహన కోసం ఇస్తున్న సమాచారం మాత్రమే. పైవార్తలో మీకు అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోగలరు.






