- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health Tips : కాలిమడమల్లో పగుళ్లు.. ఈ రెమెడీస్ ట్రై చేసి చూడండి!
Health Tips : కాలిమడమల్లో పగుళ్లు.. ఈ రెమెడీస్ ట్రై చేసి చూడండి!

దిశ, ఫీచర్స్ : కొన్ని సమస్యలు చూడ్డానికి చిన్నవిగానే అనిపిస్తాయి. కానీ ఆరోగ్యంగా, మానసికంగా అధిక ప్రభావం చూపుతాయి. కాలి మడమలు పగలడం కూడా అలాంటిదే. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతుంటారు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, మనం తొడిగే చెప్పులు, షూస్‌లలో బ్యాక్టీరియాలు పేరుకుపోయినప్పుడు మడిమలు వాటికి గురైనా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కొందరికి శరీరంలో జరిగే మార్పులు, వేడి, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా మడమల్లో పగుళ్లు ఏర్పడవచ్చు. ఇవి ఎక్కువైతే రక్తం కారుతూ నొప్పిగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
* కాలి మడమల్లో పగుళ్లు ఏర్పడటంవల్ల నొప్పితోపాటు పాదాలు అంద విహీనంగానూ కనిపిస్తుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. పగుళ్లు ఏర్పడిన భాగంలో గ్లిజరిన్ అప్లై చేయాలంటున్నారు నిపుణులు. అయితే దీనికి ముందు గ్లిజరిన్‌లో కొంచెం రోజ్ వాటర్ కూడా కలపాలి. పాదాలు శుభ్రంగా కడిగిన తర్వాతనే పగుళ్లపై అప్లయ్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేశాక 20 నుంచి 30 నిమిషాల తర్వాత పాదాలను కడిగి, కాటన్ క్లాత్‌తో తడి ఆరిపోయేలా తుడవాలి. గ్లిజరిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి పగుళ్లపై అలా రెండుమూడు రోజులు దానిని అప్లై చేస్తే క్రమంగా తగ్గిపోతాయి.
* కాలి మడమల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగించే మరో అద్భుతమైన రెమెడీ తేనెక. నొప్పి, గాయాలు వంటి సందర్భాల్లో వాటి నివారణలో ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని, ఉత్తమ మాయిశ్చరైజర్‌గా యూజ్ అవుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఉపయోగించే ముందు కొన్ని గోరు వెచ్చని నీళ్లను బకెట్లో గానీ, టబ్‌లో గానీ తీసుకోవాలి. అందులో తేనె కలిపి, ఆ తర్వాత పగుళ్లు పాదాల భాగాన్ని అందులో ముంచాలి. ఓ 20 నిమిషాల తర్వాత బయటకు తీసి కడగాలి. రెండు మూడు రోజులు ఇలా చేస్తే పగుళ్లు పూర్తిగా నయం అవుతాయి.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






