- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బరువు తగ్గడంలో సహాయపడే 5 అద్భుతమైన పండ్లు.. వీటిలో ఏయే పోషకాలు ఉంటాయంటే..
తక్కువ కేలరీలతో, అధిక ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే పండ్లు బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడతాయి

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. సరైన బరువును మెయింటైన్ చేయకపోతే పలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఊబకాయం ఏర్పడి రోజువారీ పనులకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి వ్యాయామాల ద్వారా, తీసుకునే ఆహారాల ద్వారా బరువును నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే అధిక బరువును తగ్గించడంలో సహాయపడే 5 ముఖ్యమైన పండ్లు ఏవి? ఏ విధంగా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం.
1. యాపిల్ : అధిక బరువు తగ్గడంలో సహాయపడే అద్భుతమైన పండు యాపిల్. ఎందుకంటే ఇందులో ఫైబర్ ( ముఖ్యంగా పెక్టివ్) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను స్లో డౌన్ చేసి, ఆకలిని తగ్గిస్తుంది. ఒక మీడియం సైజ్ యాపిల్‌లో సుమారు 95 కేలరీలు, 4 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగు పరుస్తాయి. అంతేకాకుండా యాపిల్‌లోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది ఆకస్మిక ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అయితే యాపిల్‌ను తొక్కతో సహా తినడం బెటర్ ఉత్తమం. ఎందుకంటే తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజుకు ఒక యాపిల్ తినడం అధిక బరువును తగ్గిస్తుంది.
2. బెర్రీలు : స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్బెర్రీ (Raspberry) ఇలా బెర్రీలు ఏవైనా తక్కువ కేలరీలతో, అధిక ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీలలో 50 కేలరీలు, 3 గ్రాముల ఫైబర్, బ్లూబెర్రీలలో 85 కేలరీలు, అలాగే 4 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇవి విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్‌తో జీవక్రియను పెంచుతాయి. అలాగే శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. బెర్రీలలోని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆకలిని నియంత్రిస్తుంది. వీటిని స్మూతీలలో, ఓట్స్‌లో, లేదా సలాడ్‌లలో చేర్చవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గ్రీక్ యోగర్ట్‌తో కలిపి తినడం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం ఉత్తమం.
3. అవకాడో : అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమి ఇ, కె, ఫోలేట్ ఉంటాయి. సగం అవకాడోలో సుమారు 120-160 కేలరీలు, 7 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఆకలిని తగ్గించి, జీవక్రియను మెరుగుపరుస్తాయి. అవకాడోలోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇందులోని పొటాషియం శరీరంలో నీటి సమతుల్యతను నిర్వహిస్తుంది. అవకాడోను సలాడ్‌లలో, టోస్ట్‌పై (అవకాడో టోస్ట్), లేదా స్మూతీలలో ఉపయోగించవచ్చు. రోజుకు సగం అవకాడో తినడం సరిపోతుంది, ముఖ్యంగా లంచ్ లేదా డిన్నర్‌లో చేర్చడం మంచిది. బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
4. దానిమ్మ : దానిమ్మ (Pomegranate) బరువు తగ్గించడానికి గొప్ప ఎంపిక, ఎందుకంటే ఇది తక్కువ కేలరీలు (100 calories in one medium pomegranate), అధిక ఫైబర్ (7 గ్రాములు) కలిగి ఉంటుంది. ఇందులోని పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. జీవక్రియ రేటును పెంచుతాయి. దానిమ్మ గింజలు ఆకలిని నియంత్రించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. దానిమ్మ గింజలను తాజాగా తినవచ్చు, సలాడ్‌లలో చల్లుకోవచ్చు లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా ఒక కప్పు గింజలు తినడం మంచిది.
5. గ్రేప్ ఫ్రూట్ : గ్రేప్ ఫ్రూట్ (Grapefruit) : ఇది కమలా పండులా కనిపిస్తుంది కానీ కాదు. కాపోతే సిట్రస్ కుటుంబానికి చెందిన ఒక ప్రత్యేక పండు. మొదట కమలా పండు(Orange) + Pomelo (చకోత్రా) కలయికతో (hybrid) ఏర్పడింది. రుచి పరంగా చేదు, పులుపు, తీపి కలిపి ఉంటుంది. అయితే గ్రేప్ ఫ్రూట్ కూడా అధిక బరువును తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు (సగం గ్రేప్‌ఫ్రూట్‌లో 50 కేలరీలు), అధిక నీటి శాతం (90%) కలిగి ఉంటుంది. విటమిన్ సి, ఫైబర్, నరింజిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ ఫలం జీవక్రియను వేగవంతం చేసి ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గుతారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు సగం తినడం లేదా సలాడ్‌లో చేర్చడం మంచిది. జ్యూస్‌గా తీసుకునేటప్పుడు చక్కెర జోడించకుండా తాగాలి.






