ఇన్‌స్టా, ఎఫ్‌బీలలో క్రాస్ రీల్స్ ఆప్షన్!

by Disha Web Desk 7 |
ఇన్‌స్టా, ఎఫ్‌బీలలో క్రాస్ రీల్స్ ఆప్షన్!
X

దిశ, ఫీచర్స్ : టిక్‌టాక్‌తో పోటీపడేందుకు తమ యాప్‌లో రీల్స్‌ ఫీచర్‌ను హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మెటా యాజమాన్యం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.ఈ క్రమంలో సరికొత్త అప్‌డేట్స్ విడుదల చేస్తున్న మెటా.. యూజర్ ఎక్స్‌పీరియెన్స్ మెరుగుపరిచే లక్ష్యంతో ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌కు క్రాస్-పోస్టింగ్‌ సహా రీల్స్‌కు కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ కొత్త రీల్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తాజాగా ప్రకటించారు.

మెటా తీసుకొచ్చిన కొత్త ఫీచర్ సాయంతో యూజర్లు కేవలల ఒకే బటన్ నొక్కడం ద్వారా ఇన్‌స్టా నుంచి ఎఫ్‌బీ రీల్స్‌ను క్రాస్-పోస్ట్ చేసే అవకాశాన్ని పొందుతున్నారు. యాప్‌లో తమ ప్రేక్షకులను పెంచుకోవడంతో పాటు రెండు ప్లాట్‌ఫామ్స్‌లోని తమ కంటెంట్‌ను మానిటైజ్ చేసేందుకు గాను ఇది క్రియేటర్స్‌కు సాయపడుతుందని మెటా సూచిస్తోంది. అంతేకాదు స్టోరీస్‌లో పాపులరైన 'యాడ్ యువర్స్ స్టిక్కర్' ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ రీల్స్‌లో వస్తుందని మోస్సేరి పేర్కొన్నాడు.

యూజర్ సొంత యాడ్ యువర్స్ స్టిక్కర్ ప్రాంప్ట్‌ని సృష్టించినట్లయితే, స్టిక్కర్‌ను ఉపయోగించే ప్రతి రీల్ ప్రత్యేక పేజీలో కనిపిస్తుంది. ప్రాంప్ట్‌ను సృష్టించిన వ్యక్తి.. పేజీలో కూడా ప్రముఖంగా ప్రదర్శించబడతారు.ఈ ఆప్షన్ క్రియేటర్లకు ప్రేక్షకులను పెంచుకునేందుకు దోహదపడుతుంది. అంతేకాదు ప్లాట్‌ఫామ్‌లోని అర్హత కలిగిన క్రియేటర్స్‌కు త్వరలో Facebook స్టార్స్ టిప్పింగ్ ఫంక్షన్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు. తమ ప్రేక్షకుల కోసం ఏ కంటెంట్ పని చేస్తుందో గుర్తించడంలో క్రియేటర్స్‌కు సాయపడేందుకు గాను వారు క్రియేటర్ స్టూడియో(రీచ్, వీక్షించిన నిమిషాలు, సగటు వీక్షణ సమయం సహా కొలమానాలతో) ద్వారా మరిన్ని రీల్స్ అంతర్దృష్టులకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు.



Next Story