- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మోహన్‌లాల్‌పై ఈగను కూడా వాలనీయకుండా..
360 డిగ్రీస్‌లో నిఘా నేత్రంలా..
స్కాన్ చేస్తున్న ఆ మహిళ అను కుంజుమన్.
ఆమె మోహన్‌లాల్ సెక్యురిటీ గార్డుల్లో హెడ్.
అదేనండీ బిగ్ బౌన్సర్.
మహిళ అంటున్నారు.. మోహన్‌లాల్ బౌన్సర్ అంటున్నారని పరేషాన్ కాకండి.
ఆమెనే మోహన్‌లాల్ బౌన్సర్.
- దిశ, ఫీచర్స్
సెలబ్రిటీలు బయటకు వెళ్తే ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంటుందో తెలుసు కదా.? ఒక్కోసారి మీదికి తోసుకొస్తుంటారు. ఇలాంటి సమయంలో వాళ్లను సేఫ్‌గా తీసుకెళ్లేది బౌన్సర్లు మాత్రమే. గుంపు నుంచి తప్పించే సరికి తల ప్రాణం తోకకొస్తుంటుంది. మగ బౌన్సర్లకే చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది లేడీ బౌన్సర్‌గా అను కుంజుమన్ విజయవంతంగా రాణిస్తోంది. కేరళ తొలి మహిళా బౌన్సర్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. సెలబ్రిటీ ఈవెంట్స్ నిర్వహించడం.. పెద్ద పెద్ద ఈవెంట్లకు భద్రతను ఏర్పరిచి భద్రతా రంగంలోనూ మహిళలు రాణించగలరని నిరూపిస్తోంది కుంజుమన్.
పురుషాధిక్యతకు బ్రేక్
బౌన్సర్ అంటే పెద్ద పెద్ద కండలు తిరిగి చూస్తేనే జడుసుకునేలా కనిపిస్తారు. పార్టీలు.. పబ్బుల్లో ప్రోగ్రామ్ అయిపోయేదాక స్తంభాల్లా నిలబడతారు అని అనుకుంటారు ఎవరైనా. కానీ కుంజుమన్ ఆ మూస ధోరణిని మార్చేసింది. బౌన్సర్ అంటే బాగా కండలు తిరిగిన మగవాళ్లే కాదు.. ఆత్మస్థైర్యం ఉన్న ఆడవాళ్లు కూడా బౌన్సర్లుగా రాణిస్తారని నిరూపించింది. 37 ఏళ్ల వయసులో బలం.. ఆత్మ విశ్వాసం.. పురుషులకే పరిమితం కాదని ప్రూవ్ చేసింది. నల్లటి టీషర్ట్.. జీన్స్ ధరించి ఎంతో ధైర్యంగా నిలబడి.. భద్రతా సిబ్బందిని ఆజ్ఞాపించే విధానం అందర్నీ ఆకర్షించి.. పురుషాధిక్యతను బద్దలు కొట్టింది.
ఫొటోగ్రాఫర్ నుంచి
కుంజుమన్ గతంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేది. ప్రమోషన్ ఈవెంట్లు.. సెలబ్రిటీల పార్టీలను కవర్ చేయడమే ఆమె ఉద్యోగం. అయితే ఒక కార్యక్రమంలో పురుష బౌన్సర్‌తో కుంజుకు చిన్న గొడవ జరిగింది. సెలబ్రిటీ ఫొటో షూట్ చేస్తున్న తనను అతడు తోసేశాడట. "హలో ఏంటి అలా తోసేస్తున్నావ్.. కనిపించడం లేదా" అని అడిగితే.. "ఇట్లనే ఉంటది" అనే రేంజిలో చూశాడట. ఇక అప్పట్నుంచి కుంజు మనసులో అదే మెదులుతోంది. తాను కూడా బౌన్సర్ అవ్వాలనే పట్టుదల ఏర్పడింది. కానీ ఆమె మహిళ. అంత ఈజీనా బౌన్సర్‌గా సక్సెస్ అవడం. ఎట్లయినా సరే కావాలని పట్టుబట్టింది.
మహిళలకు మార్గదర్శి
కెరీర్ తొలినాళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది కుంజు. ఒకవైపు కుటుంబం.. మరోవైపు ప్రొఫెషన్. రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నది. ఆర్థికపరమైన సమస్యలెన్నో వచ్చాయి. ఓర్పుతో.. పట్టుదలతో వాటన్నింటినీ సవాల్ చేసి మోస్ట్ వాంటెడ్ బౌన్సర్‌గా ఎదిగింది. సెలబ్రిటీల ఈవెంట్స్.. హై ఎనర్జీ పబ్ పార్టీలకు భద్రత కల్పిస్తూ.. వ్యాపార వేత్తలు.. సినీ సెలబ్రిటీలకు రక్షణగా నిలుస్తోంది. ఆ రంగంలో రాణించేందుకు కుంజుమన్ చేసిన కృషి.. పట్టుదల ఎంతోమంది మహిళలకు మార్గదర్శిగా నిలిచేలా చేశాయి.
సక్సెస్‌ఫుల్ ఉమెన్
కుంజుమన్ లాంటి మహిళా బౌన్సర్ల స్పూర్తితో ప్రస్తుతం మహిళా బౌన్సర్లకు మస్తు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అవార్డు ఫంక్షన్లు.. ప్రముఖుల సమావేశాలు.. నైట్ పార్టీస్ వంటి ఈవెంట్స్‌లో పురుషులే కాదు మహిళా బౌన్సర్లు ధైర్యంగా పనిచేస్తున్నారు. పురుష బౌన్సర్లతో సమానంగా వేతనాలు తీసుకుంటున్నారని కుంజుమన్ చెప్తోంది. ఈవెంట్స్‌తో పాటు మహిళా సెలబ్రిటీలు.. బిజినెస్‌మ్యాన్‌లను ఎస్కార్ట్ చేసే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అంటోంది. జనసమూహాన్ని కంట్రోల్ చేయడంలో సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని నిలబడుతున్నామని కాన్ఫిడెంట్‌గా చెప్తోంది.






