- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vial Video: ప్లాస్టిక్ భోజనం చేస్తున్న క్రిములు...హమ్మయ్యా ప్లాస్టిక్ భూతానికి పరిష్కారం దొరికిందోచ్

దిశ, వెబ్ డెస్క్: Vial Video: మనిషి సృష్టించిన ప్లాస్టిక్ భూతం యావత్ ప్రపంచాన్ని కమ్మేసింది. ఒక భూతంలా మారిన ప్లాస్టిక్ సప్త సముద్రాలను కలుషితం చేసింది. ధృవాల్లో సైతం ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి. ఎవరెస్టు శిఖరం పైన కూడా ప్లాస్టిక్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణం అందులోనూ జంతు జీవజాలానికి ప్లాస్టిక్ ఒక కొరకరాని కొయ్యగా మారుతూ బీభత్సం సృష్టిస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే శాస్త్రవేత్తలు దాని వైపే అడుగులు వేస్తున్నారు. నిజానికి ప్లాస్టిక్ అనేది ఏమి చేసినా భూమిలో కలవదు.
సాధారణంగా ఏ వస్తువైనా కుళ్లిపోవడం లేదా చెద పట్టడం లేకపోతే ఏదో రకంగా క్షీణించడం అనేది జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ మాత్రం వేల సంవత్సరాలైనా ఏమాత్రం కుళ్ళిపోకుండా, చెద పట్టకుండా మరే ఇతర సూక్ష్మ క్రిమికి ఆహారం కాకుండా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ గుణం ఉండటం వల్లే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్నప్పటికీ పర్యావరణానికి మాత్రం అత్యంత కీడు చేస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ పని పట్టేందుకు మైక్రో బయాలజీ ని నమ్ముకున్నారు.
ప్లాస్టిక్ లో ఉండే ముఖ్యమైన పదార్థం పాలిథైలిన్ టెరెఫ్తాలేట్ దీనిని తినే బ్యాక్టీరియా Ideonella sakaiensis ను శాస్త్రవేత్తలు బయోటెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఇది ప్లాస్టిక్ ను కుళ్లి పోయేలా చేస్తుంంది. అలాగే కొన్ని ఫంగస్ తరగతికి చెందిన జీవులు కూడా శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు ఇవి కూడా ప్లాస్టిక్ అణువులను భూమిలో కలిసిపోయేలా చేస్తున్నాయి.
అలాగే మరికొన్ని బ్యాక్టీరియాలను కూడా ప్లాస్టిక్ తినేలా చేస్తున్నాయి. ప్రకృతి అనేది ఒక పరిష్కారం కనుగొంటుంది అనేందుకు ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేయడానికి చెట్లతో తయారు చేసిన ఫైబర్ తో కూడా ప్లాస్టిక్ తయారు చేయవచ్చు ఇది భూమిలో కలిసిపోతుంది. ఇలా మన చక్కటి భూగోళాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది.






