- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో ఆసక్తికర దృశ్యం.. జింకకు కొబ్బరి నీళ్లు తాగించిన ‘సరళమ్మ’ వీడియో వైరల్!
పచ్చని చెట్లతో కళకళలాడే ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పచ్చని చెట్లతో కళకళలాడే ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఒక మహిళ ఎంతో ఆప్యాయంగా ఓ జింకకు కొబ్బరి నీళ్లు తాగిస్తున్న వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో కన్పిస్తున్న మహిళ నెటిజన్‌లకు కొత్త కానీ, ఆ క్యాంపస్ గురించి తెలిసిన వారికి, అక్కడి విద్యార్థులకు ఆ వీడియోలోని మహిళ సుపరిచితురాలే. ఆమె పేరు ‘సరళమ్మ’. ఎన్నో ఏళ్లుగా అదే క్యాంపస్‌లో కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ ఎన్నో తరాల విద్యార్థులకు ఆమె ఆత్మీయురాలిగా మారారు. క్యాంపస్‌లో మనుషులు, వన్యప్రాణుల మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని తరచుగా తన కెమెరాలో బంధించే డాక్టర్ అనుపమ కశ్యప్.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది.
వైరల్ అవుతున్న సరళమ్మ గొప్ప మనసు..
ఈ వీడియో సరళమ్మ గొప్ప మనసును మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోపై స్పందిస్తూ ఆమెతో ఉన్న పాత జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు. ‘యూపీఐ (UPI) లావాదేవీలు అందుబాటులో లేని ఆ రోజుల్లో, నోట్ల రద్దు (Demonetisation) సమయంలో చిల్లర లేక మేము కొబ్బరినీళ్లు కొనడం మానేశాం. అది గమనించిన సరళమ్మ, మా పరిస్థితి అర్థం చేసుకుని నాకు రూ.100 అప్పుగా ఇచ్చి సాయం చేశారు’ అని రాసుకొచ్చారు. వ్యాపారానికి అతీతమైన ఆమె దయాగుణానికి ఈ ఘటనే నిదర్శనమని పలువురు కొనియాడుతున్నారు.
ప్రకృతితో మమేకమైన క్యాంపస్..
ఐఐటీ మద్రాస్ క్యాంపస్ అద్భుతమైన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ జింకలు, కోతులు, వివిధ రకాల పక్షులు స్వేచ్ఛగా తిరుగుతూ దైనందిన జీవితంలో భాగమైపోయాయి. ఈ క్యాంపస్‌లో మనుషులు, జంతువుల మధ్య ఇలాంటి అరుదైన దృశ్యాలు కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో, క్యాంపస్ రోడ్డు మధ్యలో ఓ తల్లి జింక తన పిల్లకు పాలు ఇస్తుంటే.. ఎవరూ వాటిని బెదరగొట్టకుండా, నిశ్శబ్దంగా తమ వాహనాలను ఆపి వాటికి దారి ఇచ్చిన వీడియో కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.






