- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పబ్లిక్‌గా ఆ పని చేసి షాక్ ఇచ్చిన వైద్యుడు.. జనాలు నోరెళ్లబెట్టారు..
వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆలోచిస్తే మన మనసులోకి ఠక్కున వచ్చేసేది.. కనీసం రోజుకు ఒక్కసారైనా స్నానం చేయాలనే అంశం. కానీ అమెరికాకు చెందిన డాక్టర్ జేమ్స్ హాంబ్లిన్.. ఐదేళ్లుగా స్నానం చేయలేదని

దిశ, ఫీచర్స్ : వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆలోచిస్తే మన మనసులోకి ఠక్కున వచ్చేసేది.. కనీసం రోజుకు ఒక్కసారైనా స్నానం చేయాలనే అంశం. కానీ అమెరికాకు చెందిన డాక్టర్ జేమ్స్ హాంబ్లిన్.. ఐదేళ్లుగా స్నానం చేయలేదని, అయినా తన శరీరం నుంచి దుర్వాసన ఏమీ రావట్లేదంటూ హెడ్ లైన్స్‌లో నిలిచాడు. షాంపూలు, సబ్బులు, మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్లు ఇవన్నీ కూడా బాడీపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతాయని నిరూపించేందుకే ఇలా చేశానని వివరించాడు.
పరిశుభ్రత అనేది ఆరోగ్యానికి అవసరమే లేదు. ఇది కేవలం వ్యక్తిగత ప్రాధాన్యత అని తెలిపాడు ఈ డాక్టర్. దీన్ని ప్రూవ్ చేసేందుకు క్రమం తప్పకుండా స్నానం చేయడం మానేశాడు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం అనేది బిగ్ స్కామ్ అని సూచించాడు. నిజానికి మన చర్మం సూక్ష్మజీవికి నిలయం. చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించే బ్యాక్టీరియాకు సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థ. దీన్నిసబ్బులు, షాపూలతో తరచుగా కడుగడం వల్ల చర్మం సహజంగా స్రవించే నూనెలు, రసాయనాలు తొలగిపోతాయి. చర్మం పొడిగా మారుతుంది. ఆ తర్వాత లోషన్లు, మాయిశ్చరైజర్లు వంటి ఉత్పత్తులు వాడాల్సి వస్తుంది. అంటే శుభ్రత ముసుగులో చర్మాన్ని పొడి చేసే సబ్బులు, షాంపూలు వాడటం.. మళ్లీ స్కిన్ రిపేర్ చేసి స్మూత్‌గా మార్చే లోషన్లు, మాయిశ్చరైజర్లు యూజ్ చేయడం అనేది ఒక సైకిల్‌ను క్రియేట్ చేస్తుంది. ఇదొక పెద్ద స్కామ్‌లా కనిపిస్తుంది.
స్నానం చేయకపోతే శరీరం నుంచి దుర్వాసన వస్తుందనేది ప్రజల అతిపెద్ద ఆందోళనలలో ఒకటి అన్నారు డాక్టర్ హాంబ్లిన్స్. కానీ కాలక్రమేణా అతని శరీరం దానికి అనుగుణంగా మారిందని తెలిపాడు. స్కిన్ మైక్రోబయోమ్ గట్ మైక్రోబయోమ్ కంటే చిన్నది కానీ ఫార్ములా ఒకటేనన్న ఆయన.. సూక్ష్మజీవులు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయని, మన చర్మాన్ని రక్షిస్తాయని చెప్పాడు.






