- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఒక వైపు పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తూ..
మరోవైపు అనువైన నివాస ప్రాంతంగా..
నిర్మాణ రంగంలో దూసుకుపోతుండడంతో..
అమ్మకందారులు, కొనుగోలుదారుల అందరి చూపు..
అమీన్ పూర్ వైపు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సైబర్ సిటీకి దగ్గరగా ఉండడం..
హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి చెందిన..
మియాపూర్, చందానగర్ లకు అనుకుని ఉండడంతో..
చాలామంది కొనుగోలుదారులు అమీన్ పూర్ పై ఆసక్తి కనబరుస్తున్నారు.
తమ తమ ఆఫీసులకు వెళ్లడానికి సులువైన రవాణా మార్గం ఉండడం..
భవిష్యత్తులో మెట్రో రైల్ సైతం అందుబాటులోకి ఉండడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నారు
- దిశ, పటాన్ చెరు
చిన్న గ్రామం నుంచి..
ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న అమీన్ పూర్ నేడు నిర్మాణరంగంలో అగ్రభాగాన దూసుకుపోతుంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరినీ అమీన్ పూర్ అక్కున చేర్చుకుంటుంది. సింప్లెక్స్ హౌస్ నుంచి ఆకాశ హర్మ్యాల అపార్ట్మెంట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అటు మౌలిక వసతుల కల్పన బేషుగ్గా ఉండడంతో అందరూ అమీన్ పూర్ ను తమ నివాస ప్రాంతంగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులకు అమీన్ పూర్ ను మంచి అనువైన ప్రదేశంగా రియల్ నిపుణులు చెప్తున్నారు.
పెట్టుబడులకు చిరునామా
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు చిరునామా గా అమీన్ పూర్ మారిందని చెప్పుకోవచ్చు. పదేండ్లలో నిర్మాణ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. ఇక్కడ స్థలాలపై పెట్టిన పెట్టుబడి రెండు, మూడింతల లాభాన్ని కలిగిస్తుంది. నాలుగేండ్ల కింద రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలికిన గజం ధర ప్రస్తుతం రూ. 70 వేల నుంచి లక్ష పలుకుతుంది.
ఇండిపెండెంట్ ఇండ్లు..
ఇండిపెండెంట్ ఇండ్లకు కేరాఫ్ గా అమీన్ పూర్ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పరిసరాలలో అపార్ట్మెంట్ కల్చర్ అధికంగా ఉంటుంది. కానీ అమీన్ పూర్ లో కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టు ఇటు సింప్లెక్స్ హౌస్ లు, విల్లాలు, అపార్ట్మెంట్లు లభ్యమవుతున్నాయి. ఇండిపెండెంట్ ఇల్లు కొనాలనుకున్న చాలా మంది కస్టమర్లు అమీన్ పూర్ వైపే చూస్తున్నారు. అమీన్ పూర్ లోని నరేంద్ర కాలనీ, మల్లారెడ్డి కాలనీ, వందన పురి, ఎన్ఎస్ఎల్ కాలనీ, గ్రీన్ మెడోస్, నవ్య నగర్, టీచర్స్ కాలనీలు, పటేల్ గూడలోని బీఎచ్ఈఎల్ ఎన్ క్లేవ్, సుజన లక్ష్మీ నగర్, కిష్టారెడ్డి పేటలో రెయిన్ బో మెడోస్, మైత్రి విల్లాస్ లో సింప్లెక్స్ డూప్లెక్స్ హౌస్ లకు మంచి గిరాకీ ఉంది.






