మరోసారి ట్రెండ్ అవుతున్న అలేఖ్య చిట్టి పికిల్స్.. ఆ విషయంలో కక్కుర్తి పడొద్దు.. పెళ్లి చేసుకో.. అయినా ఆ యాప్స్ ఉన్నాయిగా.. అంటూ సెటైర్స్ (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-12 12:45:37  IST  )

అలేఖ్య చిట్టి పికిల్స్.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు రన్ చేసిన బిజినెస్. సోషల్ మీడియాలో ఒకప్పుడు భారీ పాపులారిటీతో దూసుకుపోయిన బిజినెస్ ఒక్క మిస్టేక్‌తో కొలాప్స్ చేసుకున్నారు. నోటిదూలతో సఫర్ అయ్యారు. కస్టమర్‌ను

మరోసారి ట్రెండ్ అవుతున్న అలేఖ్య చిట్టి పికిల్స్.. ఆ విషయంలో కక్కుర్తి పడొద్దు.. పెళ్లి చేసుకో.. అయినా ఆ యాప్స్ ఉన్నాయిగా.. అంటూ సెటైర్స్ (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : అలేఖ్య చిట్టి పికిల్స్.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు రన్ చేసిన బిజినెస్. సోషల్ మీడియాలో ఒకప్పుడు భారీ పాపులారిటీతో దూసుకుపోయిన బిజినెస్ ఒక్క మిస్టేక్‌తో కొలాప్స్ చేసుకున్నారు. నోటిదూలతో సఫర్ అయ్యారు. కస్టమర్‌ను బండ బూతులు తిట్టి.. ట్రోలింగ్ ఎదుర్కొని.. సారీ చెప్పి.. డిప్రెషన్‌కు వెళ్లి.. చివరకు హాస్పిటల్‌లో చేరాక ఆ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్ పడింది. ఇక మేము ముగ్గురం కలిసి బిజినెస్ చేయలేమని క్లారిటీ ఇచ్చి తప్పుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ముగ్గురిలో పెళ్లి అయిన అక్క తన భర్తతో కలిసి పచ్చళ్ల వ్యాపారం చేస్తానని ప్రకటించింది. ఎంకరేజ్ చేయాలని కోరింది. మొత్తానికి మళ్లీ వన్ మంత్ బ్రేక్ తర్వాత చిట్టి మరోసారి పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఉన్న బిజినెస్ పోయింది.. జాబ్ చేస్తే ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది.. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వెతుక్కుంటున్నా.. అంటూ వీడియో రిలీజ్ చేసింది. దీంతో మరోసారి ట్రోల్ చేస్తున్నారు జనాలు. ‘ఆ యాప్స్ ఉన్నాయిగా యూజ్ చేసి డబ్బులు సంపాదించండి’, ‘ఇండైరెక్ట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అడుగుతుంది.. ఎవరో ఒక కక్కుర్తిగాడు ఇవ్వకపోతాడా అని.. కానీ కక్కుర్తి పడొద్దు భాయ్’, ‘మా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది.. వచ్చి చేసుకోండి’, ‘డిగ్రీ కూడా లేకుండా ఏం వర్క్ చేస్తుంది బ్రో’, ‘పెళ్లి చేసుకో ఇంకేం’, ‘నిజంగా కెరీర్ మీద ఫోకస్ పెట్టేదే అయితే ఇలా వీడియో రిలీజ్ చేసి డప్పు చాటింపు వేసేది కాదు.. ఇవన్నీ మానేసి సైలెంట్‌గా పనిచేసుకునేది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story