Technology : రేడియేషన్ రిస్క్ నుంచి రక్షిస్తున్న ఏఐ.. వర్క్‌ప్లేస్‌‌ సేఫ్టీలో కీ రోల్!

by Javid Pasha |   (  Updated:2025-06-16 07:21:02  IST  )

Technology : రేడియేషన్ రిస్క్ నుంచి రక్షిస్తున్న ఏఐ.. వర్క్‌ప్లేస్‌‌ సేఫ్టీలో కీ రోల్!

Technology : రేడియేషన్ రిస్క్ నుంచి రక్షిస్తున్న ఏఐ.. వర్క్‌ప్లేస్‌‌ సేఫ్టీలో కీ రోల్!
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. దాని వినియోగంవల్ల పనులు సులభతరం అవుతున్నాయి. ఇప్పటికే అనేక విషయాల్లో కృత్రిమ మేధస్సును విస్తరించడంపై సాంకేతిక నిపుణులు ఫోకస్ చేస్తున్నారు. ఇంటి పనుల నుంచి ఇండస్ట్రీయల్ పనుల వరకు హ్యూమనాయిడ్ రోబోట్స్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే పరిశ్రమల్లో, పని ప్రదేశాల్లో వర్కర్స్‌పై రేడియేషన్ ఎక్స్‌పోజర్(Radiation exposure) ప్రమాదాలను తగ్గించడానికి ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగంపై నిపుణులు పనిచేస్తున్నట్లు ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ జర్నల్‌‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఏఐ ఆధారిత సాంకేతికత (AI-based technology) ఇప్పుడు రేడియేషన్ భద్రతలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ధరించగల డోసిమీటర్ల(Wearable dosimeters) నుండి నీలకాల సమాచారాన్ని (Blue information) విశ్లేషించే అల్గారిథమ్‌లు రేడియేషన్ బహిర్గత (Radiation exposure) నమూనాలను ఊహించి, హానికరమైన డోస్‌కు ముందే రిస్క్ తగ్గింపు వ్యూహాలను (Risk reduction strategies) ఆటోమేట్ చేయగలుగుతున్నాయి. ఈ విధమైన సాంకేతికత ఆరోగ్య సంరక్షణ, అణు శక్తి, మానుఫాక్చరింగ్ (manufacturing) పరిశ్రమలలో, పని ప్రదేశాల్లో రేడియేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఉపయోగపడుతున్నది. భవిష్యత్తులో ఈ భద్రతను మరింత మెరుగు పరుస్తుందని కూడా సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఏఐ(AI) సిస్టమ్స్ రేడియేషన్ బహిర్గత హాట్‌స్పాట్‌లను గుర్తించి, కార్మికుల, ఉద్యోగల రొటేషన్‌ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా రేడియేషన్ రిస్క్ నుంచి రక్షిస్తాయి.

Next Story