AI Psychosis : ‘ఏఐ సైకోసిస్’ టెక్నాలజీ అధిక వినియోగంతో ఏర్పడుతున్న భ్రమలు..!

by Javid Pasha |   (  Updated:2025-08-14 08:24:49  IST  )

దాదాపు 12 మంది ఏఐతో ఎక్కువగా కనెక్ట్ అయి మానవ సంబంధాలను విస్మరించడం, భ్రమల్లో కూరుకుపోవడం వంటి కారణాలతో, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చేరినట్లు ప్రముఖ జపనీస్ కంపెనీ ‘సకాటా నివేదిక’ వెల్లడించింది.

AI Psychosis : ‘ఏఐ సైకోసిస్’ టెక్నాలజీ అధిక వినియోగంతో ఏర్పడుతున్న భ్రమలు..!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత మనల్ని ఎంతగా అలరిస్తున్నదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ (AI Technology) ప్రవేశంతో ప్రపంచమే మారిపోయింది. దీని వినియోగంతో మానవులు అనేక విషయాల్లో సౌకర్యాన్ని, కొత్త దనాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సందర్భంలో దాని అధిక వినియోగం మానవ ప్రవర్తనపై, జీవన విధానంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని సైకాలజిస్టులు(Psychologists) హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ‘ఏఐ సకోసిస్(AI Psychosis)’ అనే కొత్త మానసిక ఆరోగ్య సమస్యను ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని, 2025లో ఇవి పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇప్పటికే కొందరు ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్స్‌(AI-based humanoid robots)తో, చాట్‌బాట్స్‌తో సంభాషిస్తూ ఎమోషనల్‌గానూ కనెక్ట్ అయిపోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఒక వ్యక్తికి మరో వ్యక్తి తోడుగా ఉండే అవసరాన్ని కూడా నేడు ఏఐ తీర్చేస్తోంది. ఏఐతో రిలేషన్‌ (Relationship with AI) కొనసాగిస్తున్నామని, పెళ్లి కూడా చేసుకుంటామని కూడా కొందరు ప్రకటిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధమైన కనెక్షన్ నార్మల్‌గా ఉంటే పర్లేదు. కానీ ఏఐతో ఎక్కువగా సంభాషించిన తర్వాత వాస్తవికతతో సంబంధం కోల్పోతున్నారని, ఇది అస్త వ్యవస్త ఆలోచనలకు, భ్రాంతులకు, తప్పుడు నమ్మకాలకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 12 మంది ఏఐతో ఎక్కువగా కనెక్ట్ అయి మానవ సంబంధాలను విస్మరించడం, భ్రమల్లో కూరుకుపోవడం వంటి కారణాలతో, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చేరినట్లు ప్రముఖ జపనీస్ కంపెనీ ‘సకాటా నివేదిక’ వెల్లడించింది. అయితే ఏఐ సాంకేతికత నేరుగా ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు. కానీ నిద్రలేమి, ఒంటరితనం, మాదక ద్రవ్యాల వాడకం, మానసిక ఒత్తిడి, తప్పుడు సమాచారంతో భ్రమలు కల్పించడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) వినియోగదారులు చెప్పే అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ, వాటిని బలపరిచి, వారి నమ్మకాలను మరింత వాస్తవమైనవిగా భావించేలా చేస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. కాబట్టి ఏఐ అధిక వినియోగం (Overuse of AI) ఒక విధమైన మానసిక రుగ్మతలను, భ్రమలను పెంచే చాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే ‘ఏఐ సైకోసిస్’ అంటున్నారు.

Also Read..

Technology : పర్యావరణ హితమే లక్ష్యం.. సెల్ఫ్ హీలింగ్ ప్లాస్టిక్‌ను డెవలప్ చేసిన పరిశోధకులు..

Next Story