- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AI మరో అద్భుతం..16 సింథటిక్ వైరస్‌లు సక్సెస్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి ‘AI సింథటిక్ 16 వైరస్’లను శాస్తవేత్తలు విజయవంతంగా రూపొందించారు.

దిశ, ఫీచర్స్: సైన్స్ ప్రంపంచంలో మరో అద్భుతం ఆవిషృతమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి ‘AI సింథటిక్ 16 వైరస్’(AI Synthetic Viruses)లను శాస్తవేత్తలు విజయవంతంగా రూపొందించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అయింది. మొదట EVO1, EVO2 (Genetic language model) అనే జనరేటివ్ AI మోడళ్లను ఉపయోగించి 302 రకాల వైరస్ డిజైన్లను క్రియేట్ చేశారు. ఇవి జన్యువులను ఎలా ఉత్పత్తి చేయాలో, DNAను ఎలా అంచనా వేయాలో, ఎలా చికిత్స చేయాలో తెలుసుకోవడానికి 300 బిలియన్ సూక్ష్మీజీవులు, బ్యాక్టీరియాలపై ఏఐకి శిక్షణ ఇచ్చారు. ఇందులో 16 వైరస్‌లు ల్యాబ్‌లో పూర్తిస్థాయిలో బ్యాక్టీరియాను చంపేశాయి. దీంతో ఈ ఆర్టిఫిషియల్ సింథటిక్ వైరస్ సాంకేతిక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఇవి కేవలం జీవుల్లోని బ్యాక్టీరియాలపైనే అటాక్ చేస్తాయి. మనుషుల ప్రాణాలకు ఎలాంటి హాని కలిగించవని సైంటిస్టులు చెబుతున్నారు.
ఎలా పనిచేస్తాయి?
ఈ సింథటిక్ వైరస్‌లు బ్యాక్టీరియాలోకి ప్రవేశించి, వెంటనే వాటిని ముక్కలుగా చేసి ఒక్కొక్కదాన్ని అంతం చేస్తాయి. యాంటి బయోటిక్స్ పనిచేయని మొండి బ్యాక్టీరియాలను సైతం ఇవి చంపేస్తాయి. బాడీలోని హానికరమైన బ్యాక్టీరియాను టార్గెట్ చేసి అటాక్ చేసేలా వీటిని రూపొందించారు. భవిష్యత్తులో మనుషులు, జంతువులకు వ్యాపించే ప్రాణాంతక వ్యాధులకు కొత్త వ్యాక్సిన్ కనుగొనేందుకు ఇవి ఉత్తమంగా పనిచేస్తాయని, క్యాన్సర్ చికిత్సలో కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే ఐడెంటిఫై చేసి వాటిని అంతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్‌లోనూ అటాక్ చేసే మహమ్మారులను కూడా ఈ తరహా వైరస్‌లతో అడ్డుకోవచ్చని భావిస్తున్నారు.
ఇలా చేస్తే డేంజర్!
సింథటిక్ టెక్నాలజీ వైరస్‌ను తప్పుదోవ పట్టించి మనుషులపై ప్రయోగిస్తే చాలా ప్రమాదమని కొందరు సైన్స్ ఎక్స్‌పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ఒకవేళ ఈ సింథటిక్ వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వస్తే కొత్త రకమైన వ్యాధికి దారితీసే అవకాశం ఉందని, కృత్రిమంగా తయారైన వైరస్‌ను గుర్తించడం కష్టమని, స్కాన్లర్లు కూడా వీటిని పసిగట్టలేవని అంచనా వేస్తున్నారు. ఈ టెక్నాలజీని యూజ్ చేయడంలో రూల్స్ కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటిని బాక్టీరియోఫేజ్ (Bacteriophages)లు అని కూడా పిలుస్తున్నారు.






