Viral Video: హీరో, హీరోయిన్, విలన్ తో పనిలేదు...రూ.10 లక్షల్లో ఏఐతో సినిమా తీసేశారు

by Vennela |   (  Updated:2025-05-03 06:34:42  IST  )

Viral Video: ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ టెక్నాల‌జీ ప్ర‌పంచ వ్యాప్తంగా విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు గురవుతోంది.

Viral Video: హీరో, హీరోయిన్, విలన్ తో పనిలేదు...రూ.10 లక్షల్లో ఏఐతో సినిమా తీసేశారు
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ టెక్నాల‌జీ ప్ర‌పంచ వ్యాప్తంగా విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు గురవుతోంది. ఇఫ్పటికే ప‌ది మంది చేసే ప‌నిని ఒక్క ఏఐ యాప్ పూర్తి చేస్తోంది. ఈ దెబ్బతో అటు ఐటీ రంగంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. టెక్నాల‌జీ విభాగంలో రాకెట్ స్పీడుతో దూసుకొస్తోంది. ఇటీవ‌ల ఏఐ టెక్నాల‌జీ విషయంలో టాలివుడ్ పరిశ్రమ కూడా సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ కూడా ఖర్చు తగ్గించుకోవడానికి గ్రాఫిక్స్ పేరిట కోట్ల కోట్లు కుమ్మరించకుండా ఏఐతో గ్రాఫిక్స్ చేయాలని సినిమా నిపుణులు ఆలోచిస్తున్నారు.

అయితే తాజాగా ఓ నిర్మాత ఏకంగా ఏఐతో ఏకంగా ఒక సినిమానే రూపొందించి యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాడు. ఇంత కాలం ఏఐతో కేవలం షార్ట్ ఫిలింలు, ట్రైలర్లు., టీజర్లు తీసేవారు. అయితే బెంగుళూరుకు చెందిన ఓ నిర్మాత మాత్రం ఓ సినిమా తీసి మొత్తం ఇండస్ట్రీని షాక్ కు గురిచేశాడు. ఇందులో హీరో, హీరోయిన్, విలన్ అంతా ఏఐ సృష్టించిన కారక్టర్లే. ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సారి ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో నిర్మించిన సినిమాగా ఇది రికార్డులకు ఎక్కింది.

బెంగ‌ళూరులోని సిద్దెన‌హ‌ళ్లికి చెందిన న‌ర‌సింహ‌మూర్తి అనే ప్రొడ్యూసర్ కేవలం 10 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ మొట్ట‌మొద‌టి ఏఐ మూవీని రూపొందించారు. అంతేకాదు దీనికి ల‌వ్ యు అని టైటిల్ పెట్టారు. మొత్తం 95 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను దాదాపు 30 ఏఐ టూల్స్ ద్వారా రూపొందించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాకు ఇటీవ‌లే సెన్సార్ బోర్డు ఏకంగా యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌ వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



Next Story