Viral news : అందుకే భయ్యా AI కావాలనేది..! మూడేండ్ల మిస్టరీని ఛేదించిందిగా..!!

by Javid Pasha |

Viral news : అందుకే భయ్యా AI కావాలనేది..! మూడేండ్ల మిస్టరీని ఛేదించిందిగా..!!

Viral news : అందుకే భయ్యా AI కావాలనేది..! మూడేండ్ల మిస్టరీని ఛేదించిందిగా..!!
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య ఎవరు చూసినా ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(A.I) గురించే మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగాలు ఊడుతాయని కొందరు, సంబంధాలు దెబ్బతింటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్‌గా కొంత నష్టం జరిగినా.. ఏఐ టెక్నాలజీ(AI technology) సమాజానికి చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. అయితే నిజమే కదా అనిపించే సంఘటనకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అది వైరల్ సమాచారమే కావచ్చు. కానీ వాస్తవానికి అద్దం పట్టింది. ఎందుకంటే 17 మంది డాక్టర్లు కూడా చేయలేని పని ChatGPTతో కన్వర్జేషన్ ద్వారా సాధ్యమైంది.అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన అలెక్స్ అనే బాలుడు మూడేండ్లుగా అరుదైన వెన్నెముక సంబంధిత సమస్యతో అవస్థలు పడుతున్నాడు. దీంతో అతని తల్లి కోర్ట్‌నీ(Courtney) తన కొడుకును 17 మంది డాక్టర్లకు చూపెట్టినా ఫలితం లేకపోయింది. విసిగి వేసారిన ఆమె చివరకు తన కొడుకు అలెక్స్(Alex) ఎదుర్కొంటున్న బాధ, సమస్యకు సంబంధించిన లక్షణాలను వివరిస్తూ ఓపెన్ ఏఐ ఛాట్ జీపీటీతో సంభాషించింది.

కాగా అలెక్స్ ఎదుర్కొంటున్నది టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ (Tethered Cord Syndrome)గా ఏఐ సూచించింది. ఇది అరుదైన వెన్నెముక సమస్యగా పేర్కొన్నది. ఆ తర్వాత ఆమె మరోసారి వైద్యులను సంప్రదించి ఏఐతో తన కన్వర్జేషన్, అది సూచించిన వ్యాధిపేరు చెప్పగా వైద్యులు ఆశ్చర్యపోయారు. తర్వాత న్యూరో సర్జన్ కూడా మరోసారి ఎంఆర్ఐ, సిటిస్కాన్ పలు ఇతర టెస్టుల తర్వాత నిజంగానే అది ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ అని నిర్ధారించి శస్త్ర చికిత్స చేశాడు. ప్రజెంట్ అలెక్స్ బాధ నుంచి ఉపశమనం పొంది కోలుకుంటున్నాడు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందుకే భయ్యా ఏఐ కావాలనేది.. రోగ నిర్ధారణలోనూ అది గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంటున్నారు పలువురు.

Next Story