- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kidney Health : కిడ్నీలు హెల్తీగా ఉండాలా..? ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!
Kidney Health : కిడ్నీలు హెల్తీగా ఉండాలా..? ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

దిశ, ఫీచర్స్ : శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. రక్తంలోని మలినాలను వడబోసి యూరిన్ రూపంలో వ్యర్థాలు బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. జీవక్రియను మెరుగు పరుస్తాయి. కిడ్నీల పనితీరు సక్రమంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే అవి బలహీన పడతాయో అప్పుడు అనారోగ్యాలు సంభవిస్తాయి. అందుకే మూత్ర పిండాల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకోసం సహాయపడే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
* కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే రోజూ సరిపడా నీరు తాగాలి. దీంతోపాటు ఆహారంలో భాగంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, గుడ్డులోని తెల్లసొన, చేపలు, యాపిల్స్, వెల్లుల్లి, బీన్స్, చిక్కుళ్లు వంటివి తీసుకోవడం కిడ్నీ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా లీఫ్ క్యాబేజీలో ఫాస్పరస్, సోడియం, పొటాషియం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అట్లనే ఇందులో విటమిన్ బి6, బి9, విటమిన్ కె, ఫైబర్, ఫైటో కెమికల్స్, యాంటీ ఆన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
* మూత్ర పిండాల్లో సమస్యలు రాకుండా ఉంచే ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. ఇందులోని తెల్లసొనలో క్వాలిటీ ప్రొటీన్ ఉటుంది. కాబట్టి కిడ్నీలకు ఇది చాలా మంచిది అంటున్నారు నిపుణులు. దీంతోపాటు వెల్లుల్లి కూడా మేలు చేస్తుంది. ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉండటంవల్ల అధిక రక్తపోటును, ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్ ఉండటంవల్ల ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తాయి. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ కలిగి ఉండటంవల్ల చేపలను ఆహారంగా తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
*ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి యాపిల్స్ కూడా రోజూ లేదా అప్పుడప్పుడూ తింటూ ఉండాలి. వీటిలో ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఒమేగా -3, ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉన్నందున ఆలివ్ ఆయిల్ కూడా కిడ్నీలను సంరక్షించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






