ఆలస్యంగా నిద్రపోతే లేజీనెస్ రాదు..! ఉదయాన్నే మేల్కోవడం క్రమశిక్షణ కాదు..!! కారణం ఇదే..

by Javid Pasha |   (  Updated:2025-10-31 06:47:55  IST  )

రాత్రిపూట నిద్రలేకపోవడం లేజీనెస్‌కు దారితీస్తుందనడం సరికాదు. అలాగే ఉదయాన్నే నిద్రలేవడం యాక్టివ్‌నెస్‌కు, క్రమ శిక్షణకు మారుపేరని కూడా చెప్పలేం.

ఆలస్యంగా నిద్రపోతే లేజీనెస్ రాదు..! ఉదయాన్నే మేల్కోవడం క్రమశిక్షణ కాదు..!! కారణం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వాళ్లు తరచూ అలసటకు గురవుతారని, ఉదయాన్నే నిద్రమేల్కొనే వారు యాక్టివ్‌గా ఉంటారని చాలామంది చెబుతుంటారు. పైగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే త్వరగా నిద్రమేల్కొనే అలవాటు సరైన నిద్రపోని కారణంగా మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని కూడా అంటారు. కానీ నిజం కాదంటున్నారు నిపుణులు. కొందరి విషయంలో అలాంటి అనుభవాలు ఎదరైనా కూడా అందరికీ అలాగే జరుగుతుందని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే న్యూరోసైన్స్ ప్రకారం ఇదంతా మీ ‘క్రోనోటైప్‌’ను బట్టి ఉంటుందని పేర్కొంటున్నారు. అదెలాగో చూద్దాం.

క్రోనోటైప్ అంటే?

రాత్రిపూట నిద్రలేకపోవడం లేజీనెస్‌కు దారితీస్తుందనడం సరికాదు. అలాగే ఉదయాన్నే నిద్రలేవడం యాక్టివ్‌నెస్‌కు, క్రమ శిక్షణకు మారుపేరని కూడా చెప్పలేం. ఆయా వ్యక్తుల క్రోనోటైప్‌ను బట్టి ఉంటుంది. క్రోనో టైప్ (Chronotype) అంటే.. ఇక్కడ మీ శరీరానికి సంబంధించిన సహజ అంతర్గత గడియారం (Biological clock). ఇది నిద్ర-మేల్కొనే చక్రాన్ని(Sleep-wake cycle) ప్రభావితం చేయడం ద్వారా మీలో శక్తి స్థాయిలు, ఫోకస్, అలాగే సృజనాత్మకత ఎప్పుడు గరిష్టంగా ఉంటాయో నిర్ణయిస్తుంది.

ఎలా ప్రభావితం చేస్తుంది?

క్రోనోటైప్ ప్రభావం కారణంగానే కొందరు ఉదయం 5 లేదా 6 గంటలకు సహజంగానే మేల్కొంటారు. అలాగే రాత్రి 9 లేదా 10 గంటలకు నిద్రపోతారు (Morning Lark or Early Chronotype), మరికొందరు రాత్రి 1 లేదా 2 గంటల వరకు మేల్కొని ఉంటారు. పొద్దున్నే 5 గంటలకో, కొందరు ఉదయం 9 లేదా10 గంటలకో కూడా మేల్కొంటారు (Night Owl or Late Chronotype). నిజానికిది జన్యుపరంగా నిర్ణయించబడుతుంది. అంతే తప్ప రాత్రి రెండు మూడు గంటల ఆలస్యంగా పడుకున్నంత మాత్రాన, మళ్లీ ఉదయాన్నే నిద్రలేస్తే అలసటకు గురవుతారని అనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. అదే విధంగా రాత్రి తొందరగా పడుకొని, ఉదయం తొందరగా లేసినంత మాత్రాన కూడా అలసటకు గురికారు అనడానికి కూడా లేదని చెబుతున్నారు. ఇదంతా 90% ఆయా వ్యక్తుల అంతర్గత జీవగడియారాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. అందుకే మీ శరీరం ఏ టైపో అనుభవం ద్వారా తెలిసి, మసలుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. Link

Next Story