Love & Life : ఆ విషయంలో పురుషులకు తొందరెక్కువ.. స్త్రీలకంటే ముందుగానే ప్రేమలో పడిపోతారట!

by Javid Pasha |

Love & Life : ఆ విషయంలో పురుషులకు తొందరెక్కువ.. స్త్రీలకంటే ముందుగానే ప్రేమలో పడిపోతారట!

Love & Life : ఆ విషయంలో పురుషులకు తొందరెక్కువ.. స్త్రీలకంటే ముందుగానే ప్రేమలో పడిపోతారట!
X

దిశ, ఫీచర్స్ : మనసుకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడటం మానవ సహజం. అయితే స్త్రీ, పురుషులిద్దరిలో ఎవరు ముందుగా లవ్‌లో పడతారనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? మీకు సమాధానం దొరికిందో లేదో కానీ.. ఇటీవలి ఓ అధ్యయనం మాత్రం అసలు విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. స్త్రీలకంటే పురుషులే చాలా తక్కువ సమయంలో ప్రేమలో పడతారట. అదెలాగో చూద్దాం

అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మానవ సంబంధాలు, స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ (Love between a man and a woman)వ్యవహారాలపై సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా 33 దేశాలకు చెందిన 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గల 808 మంది యువతీ యువకులను ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా వారు సాధారణంగా పురుషులు స్త్రీలకంటే ఒక నెల ముందుగానే ప్రేమలో గుర్తించారు.

మహిళలతో పోలిస్తే పురుషులు ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్(Romantic relationship) ప్రారంభమైన తర్వాత సుమారు 29 రోజులకు ప్రేమలో పడినట్లు సర్వే వెల్లడించగా.. స్త్రీలు మాత్రం సుమారు 58 రోజుల తర్వాత ప్రేమలో పడినట్లు పేర్కొన్నది. అంటే ఈ వ్యత్యాసం స్త్రీలు ప్రేమలో పడేందుకు ఎక్కువ సమయం తీసుకోవడాన్ని సూచిస్తుందని, బహుశా భావోద్వేగ సంబంధాలలో జాగ్రత్తగా ఉండే స్వభావం వల్ల కావచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. 30% మంది పురుషులు సంబంధం అధికారికంగా ప్రారంభమవడానికి ముందే (relationship officially began) ప్రేమలో పడినట్లు సర్వే పేర్కొనగా, స్త్రీలలో ఇది 20% కంటే తక్కువగా ఉంది. దీనిని బట్టి పురుషులు తమ మనసులో మాటను, భావోద్వేగాలను వేగంగా అంగీకరించడానికి లేదా వ్యక్తం చేయడానికి (accept or express their emotions quickly) ఎక్కువగా ఇష్టపడతారని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు సర్వేను విశ్లేషించిన పరిశోధకులు. అయితే పురుషులు త్వరగాప్రేమలో పడినప్పటికీ, స్త్రీలతో పోలిస్తే రొమాటింక్ లవ్(romantic love) విషయంలో కొంచెం తక్కువగా నిబద్ధత కలిగి ఉన్నట్లు అధ్యయనం పేర్కొన్నది. అయితే స్త్రీలు మాత్రం ఒకసారి ప్రేమలో పడిన తర్వాత పురుషులకంటే ఎక్కువ నిబద్ధత, కమిట్మెంట్‌, భావోద్వేగ స్థిరత్వం ప్రదర్శి్స్తారని, ఇది సంబంధాలలో మహిళల దీర్ఘకాలిక ఆలోచనను ప్రతిబింబిస్తుందని వెల్లడించింది.

Next Story