- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Social Media : వామ్మో.. సోషల్ మీడియా..! రోజుకు 1 గంట 48 నిమిషాలు అందులోనే..!!
Social Media : వామ్మో.. సోషల్ మీడియా..! రోజుకు 1 గంట 48 నిమిషాలు అందులోనే..!!

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా.. ప్రస్తుతం ఇదొక ఎంటర్టైన్మెంట్ వేదిక మాత్రమే కాదు, సమాచార సర్వస్వం. విజ్ఞాన భాండాగారం. ప్రపంచంతో వేగంగా కనెక్ట్ అయ్యే సులువైన మార్గం. ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం.. ప్రతీ గంట ఎక్కడ ఏం జరుగుతుందో మన కళ్లముందుంచుతుంది. సరికొత్త అంశాలతో, ఆకట్టుకునే విషయాలతో మనల్ని అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజా అధ్యయనం కూడా అదే చెబుతోంది. అయితే ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంది? ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారో కూడా పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.
సామాజిక మాధ్యమాలు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తు్న్నాయో తెలుసుకునేందుకు ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌లో ఉన్న ప్రముఖ వెబ్ హోస్టింగ్ అండ్ ఇంటర్నెట్ సేవల సంస్థ అయిన ఫాస్ట్‌హోస్ట్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ రీసెంట్‌గా అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం ఈ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం సగటు వ్యక్తి సంవత్సారానికి సోషల్ మీడియాలో నిమగ్నమవడంవల్ల 141.9 కిలోమీటర్ల దూరం స్క్రోల్ చేస్తున్నాడు. అంటే రోజుకు 108 నిమిషాలు (సుమారు 1.8 గంటలు) సోషల్ మీడియాలోనే గడుపుతున్నాడు. అంటే ఒక విధంగా ఈ వినియోగం ప్రతీ5 సెకన్లకు 30 సెంటీమీటర్ల స్క్రోల్‌తో, ఎవరెస్ట్ పర్వతాన్ని 16 సార్లు అధిరోహించినంత దూరానికి సమానంగా ఉందని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు పేర్కొంటున్నారు.






