PMRF SCHEME : విద్యార్థులు నెలకు రూ. 70 వేలు పొందే చాన్స్..

by Sujitha Rachapalli |

ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్(PMRF) స్కీమ్ డాక్టోరల్ పరిశోధనలో బెస్ట్ టాలెంట్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. అట్రాక్టివ్ ఫెలోషిప్స్ అందిస్తుంది. 2018-19 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించగా... తాజాగా ఈ స్కీమ్ కింద ఐదేళ్లలో 10,000 ఫెలోషిప్‌లను అందించనున్నట్లు తెలిపారు.

PMRF SCHEME :  విద్యార్థులు నెలకు రూ. 70 వేలు పొందే చాన్స్..
X

దిశ, ఫీచర్స్ : ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్(PMRF) స్కీమ్ డాక్టోరల్ పరిశోధనలో బెస్ట్ టాలెంట్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. అట్రాక్టివ్ ఫెలోషిప్స్ అందిస్తుంది. 2018-19 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించగా... తాజాగా ఈ స్కీమ్ కింద ఐదేళ్లలో 10,000 ఫెలోషిప్‌లను అందించనున్నట్లు తెలిపారు. కాగా PMRF స్కీమ్ హైలెట్స్, బెనిఫిట్స్, ఫెలోషిప్ ఎమౌంట్, ఎలిజిబిలిటీ గురించి ఫుల్ డిటెయిల్స్ మీకోసం.

పీఎంఆర్ఎఫ్ స్కీమ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కు డైరెక్ట్ అడ్మిషన్ అందిస్తుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో నెలకు రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఫెలోషిప్స్ అందిస్తుంది. ఐదేళ్లపాటు ఈ ప్రోత్సహకాలు అందిస్తూనే ప్రతి ఏడాది రూ. 2లక్షల వరకు రీసెర్చ్ గ్రాంట్ కూడా ఇస్తుంది. ఇక సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(CFTIs), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE)లో ఎంటెక్ చేస్తున్న విద్యార్థులకు నెలకు రూ. 12,400 ఫెలోషిప్ ఆఫర్ చేస్తుంది.

అర్హతలు :

1. కిందివాటిలో ఏదో ఒక ఎలిజిబిలిటీ ఉండాలి.

* IISc/IIT/NIT/IISERS/IIEST, కేంద్ర నిధులతో పనిచేసే IIITల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లలో నాలుగు (లేదా ఐదు) సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Tech. లేదా రెండేళ్ల M.Sc. లేదా ఐదు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా లాస్ట్ ఇయర్ చదువుతుండాలి. ఈ అభ్యర్థులు 10-పాయింట్ స్కేల్‌లో కనీసం 8.0 పాయింట్స్ CGPA/CPIని పొంది ఉండాలి. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లేదా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలోని దరఖాస్తుదారులకు, ప్రోగ్రామ్‌లోని UG, PG భాగాలకు ప్రత్యేక CGPA/CPI ఇవ్వబడితే.. UG పార్ట్ CGPA/CPI (మొదటి నాలుగు సంవత్సరాలు) పరిగణించబడుతుంది.

* భారతదేశంలో గుర్తింపు పొందిన ఏదైనా ఇతర సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి నాలుగు (లేదా ఐదు) సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Tech. లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Sc. లేదా రెండేళ్ల M.Sc. లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లలో ఐదు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను పూర్తి చేసి ఉండాలి లేదా ఫైనల్ ఇయర్‌ చదువుతుండాలి. ఈ అభ్యర్థులు సంబంధిత GATE సబ్జెక్టులో కనీసం 650 స్కోరుతో పాటు NBHM ఫెలోషిప్‌తో 100 లేదా అంతకంటే తక్కువ UGC/CSIR JRF ర్యాంక్ పొంది ఉండాలి.

* GATE అర్హత సాధించి, దరఖాస్తు సమయంలో PMRF గ్రాంటింగ్ సంస్థలలో M.Tech./MS చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి.

2. అర్హులైతే PMRF మంజూరు చేసే ఒక సంస్థలో Ph.D. ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

3. విద్యార్థిని పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేర్చుకున్న PMRF గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్.. సంబంధిత సమాచారాన్ని PMRF వెబ్-పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తుంది.

4. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశించిన 12-18 నెలల్లోపు.. క్యాండిడేట్ పర్ఫార్మెన్స్‌ను PMRF ప్యానెల్ రివ్యూ చేస్తుంది. పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే ఫెలోషిప్ కంటిన్యూ చేస్తుంది.

Next Story