- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాపింగ్ త్వరగా చేయమని మీ భర్త విసిగిస్తున్నాడా? ఆ టైంలో హజ్బెండ్ స్టోరేజ్‌లో పడేయండి.. సరికొత్త కాన్సెప్ట్..
ఆడవాళ్లకు షాపింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయాన్నే బయటకు వెళ్తే రాత్రి వరకు కూడా షాపులు తిరిగేందుకు ఇష్టపడుతారు. కానీ మగాళ్లకు మాత్రం ఈ పద్ధతి ఇష్టం ఉండదు. ముఖ్యంగా

దిశ, ఫీచర్స్ : ఆడవాళ్లకు షాపింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయాన్నే బయటకు వెళ్తే రాత్రి వరకు కూడా షాపులు తిరిగేందుకు ఇష్టపడుతారు. కానీ మగాళ్లకు మాత్రం ఈ పద్ధతి ఇష్టం ఉండదు. ముఖ్యంగా భర్తలు.. భార్యలు షాపింగ్ చేస్తుంటే విసుక్కుంటారు. త్వరగా కానిచ్చేయని ఒత్తిడి చేస్తారు. ఒకవేళ ఈ పరిస్థితి మీకు ఎదురైతే ఏం చేస్తారో తెలియదు కానీ చైనాలో మాత్రం హజ్బెండ్స్ స్టోరేజ్‌లో భర్తలను వదిలేస్తారు. హాయిగా షాపింగ్ చేసేస్తారు. ఏంటి ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉందా? అని అనుకుంటున్నారు కదా. హండ్రెడ్ పర్సెంట్ ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా భర్తలు ఫ్రీగా ఉన్నప్పుడే భార్యలు షాపింగ్ చేయాలని కోరుకుంటారు. కానీ భర్తలు ఆ ఫ్రీ టైంలో కాస్త రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. అందుకే చైనాలోని కొన్ని మాల్స్ ‘హజ్బెండ్స్ స్టోరేజ్’ కాన్సెప్ట్‌ను ప్రారంభించాయి. భార్యలు షాపింగ్ చేసే సమయంలో భర్తలు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన లాంజ్ ఏరియాలను ఏర్పాటు చేశాయి. ఈ మాన్ కేవ్ లాంటి జోన్‌లలో రిక్లైనర్స్, వీడియో గేమ్స్, టీవీలు, స్నాక్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు. 2017లో షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్‌లో ఈ ప్రైవేట్ లాంజెస్ గ్లాస్ క్యాబిన్‌లు ప్రారంభమయ్యాయి. వీటిలో సౌకర్యవంతమైన కుర్చీలు, టీవీ స్క్రీన్‌లు, కంప్యూటర్లు, 1990ల రెట్రో వీడియో గేమ్స్ ఉన్నాయి. భర్తలు షాపింగ్‌లో నీరసం లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి మంచి మార్గంగా ప్రశంసలు అందుకున్నాయి. అయితే మొదట్లో ఈ పాడ్‌లు ఉచితంగా ఉండేవి. కానీ తర్వాత ఫీజ్ వసూలు చేయడం మొదలుపెట్టాయి మాల్స్.






