ఆన్‌లైన్‌లో రాసలీలలు.. అడ్డంగా దొరకడంతో.. అర్ధరాత్రి ఆ సమయంలో చేసిన పనికి.. (DIGITAL AFFAIR)

by Sujitha Rachapalli |

భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ కల్చర్ మారుతోంది. ఇల్లీగల్ ఎఫైర్స్ కామన్ అయిపోయాయి. ఒకవేళ అడ్డొస్తే భాగస్వామిని చంపేందుకు కూడా

ఆన్‌లైన్‌లో రాసలీలలు.. అడ్డంగా దొరకడంతో.. అర్ధరాత్రి ఆ సమయంలో చేసిన పనికి.. (DIGITAL AFFAIR)
X

దిశ, ఫీచర్స్ : భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ కల్చర్ మారుతోంది. ఇల్లీగల్ ఎఫైర్స్ కామన్ అయిపోయాయి. ఒకవేళ అడ్డొస్తే భాగస్వామిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల కాలంలో ఇంతకు మించిన నమ్మకద్రోహం కూడా జరుగుతుందని తెలిపింది తాజా అధ్యయనం. 40శాతం మంది వివాహితులు ‘డిజిటల్ ఎఫైర్స్’ మెయింటెన్ చేస్తున్నట్లు గుర్తించింది. ఇది భావోద్వేగ విశ్వసనీయతకు పరీక్ష కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మిస్ యూజ్...

సోషల్ మీడియా.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్స్ ఓపెన్ చేసి కమ్యూనికేట్ కావడంలో తప్పులేదు. బంధువులు, సహోద్యోగులతో మాట్లాడటం, సమస్యలు పరిష్కరించుకోవడం వరకు మంచిదే. కానీ దాన్ని మిస్ యూజ్ చేస్తున్న వారు ఇండియాలో దాదాపు సగం మంది ఉన్నట్లు చెప్తుంది స్టడీ. 37% మంది ఇలా ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం శారీరక సంబంధం కంటే దారుణమైనదని నమ్ముతున్నప్పటికీ.. చాలామంది అలాంటి వర్చువల్ కనెక్షన్‌లను కొనసాగిస్తున్నారు. ఇది ఆధునిక భారతీయ వివాహాలలో మారుతున్న గతిశీలతను ప్రతిబింబిస్తుంది.

దేనికదే.. కానీ..

సాధారణ ఆన్‌లైన్ చిట్‌ చాట్‌గా మొదలైన పరిచయం డిజిటల్ ఎఫైర్‌గా డెవలప్ అవుతుంది. అలాగని డిజిటల్ మోసగాళ్లలో 72% మంది తమ వివాహాలను విడిచిపెట్టే ఉద్దేశ్యం లేదు. ఈ ఆన్‌లైన్ వ్యవహారాలను ఇంట్లో ఒత్తిడి నుంచి తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నారు. అలా చాట్, మీటింగ్‌లతో రిలాక్స్ అవుతున్నారు. 30-45 సంవత్సరాల వయస్సు గల పురుషులు, 25-40 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ విషయంలో చాలా చురుగ్గా ఉంటున్నారు. 56% మంది మహిళలు నిజ జీవితంలో కంటే ఈ వర్చువల్ కనెక్షన్లకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. విలువైనదిగా అనుభూతి చెందుతున్నారు. ఇది భావోద్వేగ ధృవీకరణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది.

కలవాల్సిన అవసరం లేదు..

సాంప్రదాయ వ్యవహారాల మాదిరిగా కాకుండా... డిజిటల్ ఫ్లింగ్‌లకు వినియోగదారు పేరు, Wi-Fi మాత్రమే అవసరం. కొవిడ్ మహమ్మారి తర్వాత.. జంటలు ఇంట్లో ఎమోషనల్ డిస్‌కనెక్ట్‌ను ఎదుర్కొన్నందున వినియోగదారు కార్యకలాపాలు 30% పెరిగాయి. సాధారణ మెసేజ్‌లతో ప్రారంభమైన కథ.. పూర్తి స్థాయి భావోద్వేగ వ్యవహారంగా మారుతుంది. 49% మంది రోజువారీ సరసాలు చాటింగ్‌లో చేసుకుంటున్నట్లు ఒప్పుకుంటున్నారు. ఇది భాగస్వామిపై అవిశ్వాసం పెరిగేందుకు కారణమవుతుంది.

ఆ సమయంలోనే జరుగుతోంది..

ఇలాంటి డిజిటల్ ఎఫైర్‌తో లవ్ హార్మోన్ రిలీజ్ అయి హ్యాపీగా ఉంటున్నారని మనస్తత్వవేత్తలు అంటున్నారు. ఫ్లర్టింగ్ మెసేజ్‌లు శారీరక సాన్నిహిత్యం లాంటి మెదడు ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. చాలా మంది వినియోగదారులు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంటల మధ్య భావోద్వేగ సంబంధాన్ని కోరుతూ లాగిన్ అవుతారు. భావోద్వేగ నిర్లక్ష్యం (41%), ఉత్సాహం లేకపోవడం (33%), ఆకర్షణీయంగా లేనట్లు అనిపించడం (22%) ప్రధాన కారణాలుగా పేర్కొనబడ్డాయి

దొరికినోడే దొంగ...

ఈ డిజిటల్ వ్యవహారాలు భారతీయ వివాహాలలో విశ్వసనీయతకు సంబంధించిన సాంప్రదాయ ఆలోచనలను సవాలు చేస్తున్నాయి. భావోద్వేగ సరిహద్దులు, గోప్యత గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆసక్తికరంగా 68% మంది వినియోగదారులు తమ భాగస్వామికి కూడా ఇలాంటి ఆన్‌లైన్ సంబంధం ఉన్నప్పటికీ.. వారు మోసపోయినట్లు భావిస్తారని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఇతరులతో శారీరక సంబంధాలను కలిగి ఉండటం కంటే ఈ సీక్రెట్ చాటింగ్‌ కారణంగా వివాహ బంధం బీటలు వారుతుంది. విడాకుల వరకు పోతుంది.

Next Story