భాగ్యనగరం లైఫ్ స్టైల్ మార్చేస్తున్న కాసాగ్రాండ్

by Sujitha Rachapalli |

హైదరాబాద్‌లో కాసాగ్రాండ్,, మాండరిన్‌ పేరుతో అపార్ట్‌మెంట్.. విల్లా మాదిరిగా డిజైన్స్.. తక్కువ డెన్సిటీతో కూడిన అపార్ట్‌మెంట్స్ ప్రధానలక్ష్యం

భాగ్యనగరం లైఫ్ స్టైల్ మార్చేస్తున్న కాసాగ్రాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటిగా చెప్పుకునే కాసాగ్రాండ్ ఇప్పుడు హైదరాబాద్‌ లైఫ్ స్టయిల్‌ని మార్చేస్తోంది. మియాపూర్‌లో తన ల్యాండ్‌ మార్క్ గేటెడ్ కమ్యూనిటీ కాసాగ్రాండ్ మాండరిన్‌ను ప్రారంభించింది. నగరంలోనే మొట్ట మొదటి APARTMENTను ఆవిష్కరించింది. దీనిని లివింగ్‌ను విల్లా-స్కేల్ అనుభవానికి పెంచింది. సువిశాల విస్తీర్ణంలో కొత్త బెంచ్‌మార్క్‌ను పరిచయం చేస్తున్నది. 334 అల్ట్రా విశాలమైన 3, 4 బెడ్రూం సిగ్నేచర్ ఫ్లాట్లను డిజైన్ చేసింది. కేవలం రూ.1.25 కోట్ల నుంచి ప్రారంభం అవుతుండగా.. ఆరు బ్లాకుల్లో విస్తరించింది.

తక్కువ డెన్సిటీతో కూడిన అపార్ట్‌మెంట్ కాసాగ్రాండ్ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. 5.3 ఎకరాల్లో గ్రీనరీ, వాహనాలు లేని పోడియం జోన్లతో సహా 5.7 ఎకరాల బహిరంగ స్థలాన్ని కలిగి ఉంది. ప్రాజెక్ట్ వెంటిలేషన్ బాగుంటుందంటున్నారు. 41 వేల చదరపు అడుగుల 5 అంతస్తుల క్లబ్‌హౌజ్, 5600 చదరపు అడుగుల క్లోరిన్ రహిత స్విమ్మింగ్ పూల్, 70 కి పైగా అదనపు సౌకర్యాలు, 25 కి పైగా వెల్‌నెస్ కేంద్రీకృత సదుపాయాలను కల్పిస్తున్నారు. కమ్యూనిటీ, నేచర్, ఎంటర్ టైన్మెంట్, పబ్లిక్ యుటిలిటీ స్థలాలను రూపొందిస్తున్నారు. బాంకెట్-స్కేల్ లివింగ్, డైనింగ్ ఏరియాలు, లగ్జరీ-సైజు బెడ్‌రూమ్‌లు, కన్వర్టిబుల్ బాల్కనీలు, వాస్తు కంప్లీట్ డిజైన్‌తో ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేసిన ప్రాజెక్టుగా కాసాగ్రాండ్ సంస్థ ప్రకటించింది.

కాసాగ్రాండ్ మాండరిన్ అంటే..

కాసాగ్రాండ్ మాండరిన్‌ను నిజంగా అపార్ట్‌మెంట్‌గా అంటే.. సంప్రదాయ అపార్ట్‌మెంట్ ఫార్మాట్‌లకు మించినదిగా చెబుతున్నారు. అధిక కార్పెట్-ఏరియా ఆప్టిమైజేషన్ ద్వారా గరిష్టంగా ఉపయోగించగల స్థలాలుగా ఉంటాయి. విలాసవంతమైన లివింగ్, డైనింగ్ స్పైన్, అర్బన్ నివాసాల్లో అరుదుగా కనిపించే లగ్జరీ ఇంటీరియర్‌లను చూపిస్తున్నారు. బెడ్‌రూమ్‌లు విల్లా మాదిరిగా డిజైన్ చేశారు. కనీసం 13 అడుగుల వెడల్పు నుంచి 14 x 18 అడుగుల వరకు విస్తరించి, లాంజ్ సీటింగ్ ఉంటుంది. పూర్తి నిడివి గల వార్డ్‌రోబ్‌లు ఉంటాయి. కన్వర్టిబుల్ బాల్కనీలు, మూడు రెట్లు ఎక్కువ వెంటిలేషన్, సహజ కాంతిని అందించడం ద్వారా మెరుగైన లైఫ్ స్టయిల్ పొందే వీలుంది.

Next Story