- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CALL MERGING SCAM : స్నేహితుడిని అంటూ కాల్ చేస్తారు.. బ్యాంక్ ఎకౌంట్ ఖాళీ చేస్తారు..
టెక్నాలజీ అప్‌డేట్ అవుతోంది. స్కామర్స్ సరికొత్తగా మోసగించేందుకు దారులు వెతుకుతూనే ఉన్నారు. సాధారణ జనాలకు ఓటీపీ ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల బ్యాంక్‌లో డబ్బు ఖాళీ అవుతుందని తెలియడంతో

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ అప్‌డేట్ అవుతోంది. స్కామర్స్ సరికొత్తగా మోసగించేందుకు దారులు వెతుకుతూనే ఉన్నారు. సాధారణ జనాలకు ఓటీపీ ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల బ్యాంక్‌లో డబ్బు ఖాళీ అవుతుందని తెలియడంతో.. మరింత ట్రెండీగా స్కామ్ చేసేందుకు రెడీ అయ్యారు. అదే ‘కాల్ మెర్జింగ్ స్కామ్’. కాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీని గురించి హెచ్చరిక జారీ చేసింది. వినియోగదారులు తెలియకుండానే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTPలు) పంచుకుంటున్నారని, స్కామర్లు డబ్బును దొంగిలిస్తారని సూచించింది.
స్కామ్ ఎలా చేస్తారు?
స్కామర్లు టార్గెట్ చేసిన వ్యక్తి నంబర్‌ను స్నేహితుడి నుంచి తీసుకున్నామని వినియోగదారులకు కాల్ చేస్తారు. తర్వాత ఆ ఫ్రెండే మరొక నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని, కాల్‌ను మెర్జ్ చేయమని కోరుతారు. అలా కాల్స్ మెర్జ్ అయిన తర్వాత.. బాధితుడు తెలియకుండానే వారి బ్యాంకు నుంచి చట్టబద్ధమైన OTP వెరిఫికేషన్ కాల్‌తో కనెక్ట్ అవుతాడు. దీని వలన బాధితుడు తాను మోసపోతున్నానని గ్రహించకుండానే OTPని పంచుకుంటాడు. OTP అందించిన వెంటనే, మోసగాళ్ళు లావాదేవీని పూర్తి చేస్తారు. బాధితుడి ఎకౌంట్ డబ్బు పోతుంది.
సెక్యూరిటీ టిప్స్
- తెలియని నంబర్ నుంచి కాల్స్‌ను ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు. అలా చేయమని అడిగినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి.
- ఎవరైనా మీ బ్యాంక్ లేదా తెలిసిన కాంటాక్ట్ నుంచి వచ్చామని చెప్తే.. సమాచారం షేర్ చేసే ముందు వారు నిజంగానే బ్యాంక్‌కు సంబంధించినవారా లేదా నిర్ధారించుకోవాలి.
- మీరు ప్రారంభించని లావాదేవీకి OTP వస్తే.. మీ బ్యాంకును అప్రమత్తం చేయడానికి, సైబర్ మోస ప్రయత్నానికి వ్యతిరేకంగా అవసరమైన చర్య తీసుకోవడానికి వెంటనే 1930కు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ సెల్‌కు రిపోర్టు చేయండి.






