మహిళలు, పిల్లల కోసం ఆంధ్రా కుర్రాడి క్యూఆర్ కోడ్

by Sujitha Rachapalli |

మహిళలు, పిల్లలకు భద్రత కరువైంది. సమాజంలో ప్రధాన సమస్యగా మారింది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కాలేజీ విద్యార్థి.

మహిళలు, పిల్లల కోసం ఆంధ్రా కుర్రాడి క్యూఆర్ కోడ్
X

దిశ, ఫీచర్స్ : మహిళలు, పిల్లలకు భద్రత కరువైంది. సమాజంలో ప్రధాన సమస్యగా మారింది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కాలేజీ విద్యార్థి. ఇంతకీ ఆయన ఏం ఇన్వెంట్ చేశాడు? పిల్లలకు, స్త్రీలకు ఎలాంటి రక్షణ అందిస్తుంది?

కాలేజీ ప్రాజెక్ట్.. పబ్లిక్‌‌ సెక్యూరిటీ

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న జి. శ్రీనివాస్ రెడ్డి తన ప్రాజెక్ట్‌ను అందరిలాగే కాపీ పేస్ట్ మాదిరిగా కాకుండా సీరియస్‌గా తీసుకున్నాడు. తన ప్రాజెక్ట్ సొసైటీకి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ క్యూర్‌ఆర్ కోడ్ డెవలప్ చేశాడు. తన స్టార్టప్ SAS Electronics LLP ద్వారా ఈ ప్రాజెక్ట్ చేశాడు. ఎన్‌టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసు అధికారుల మార్గదర్శకత్వంతో డెవలప్ చేయగా.. ఆటోలు, ట్యాక్సీలు, అద్దె వాహనాలు (Uber, Ola, Rapido వంటి యాప్‌లలో కూడా)లో ప్రయాణించే ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి డ్రైవర్, వాహనం వివరాలు త్వరగా తెలుసుకోవడం, అత్యవసర సమయంలో సహాయం పొందడం కష్టంగా ఉంటుంది. అందుకే వాహనం లోపల (సాధారణంగా డ్రైవర్ సీటు వెనుక) క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అతికించి ఉంటుంది.

ప్రయాణం మొదలైన వెంటనే ప్రయాణికుడు తన మొబైల్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే... వెంటనే స్క్రీన్‌పై డ్రైవర్ వివరాలు, వెహికిల్ రిజిస్ట్రేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా కనిపిస్తాయి. అదే సమయంలో లైవ్ లొకేషన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు, సమీపంలోని పెట్రోలింగ్ టీమ్‌లకు పంపబడుతుంది. అంతేకాదు ప్రయాణం ముగిసిన తర్వాత ఫీడ్‌బ్యాక్, రేటింగ్ ఇవ్వవచ్చు.

చాలా సింపుల్

ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు ఈ వ్యవస్థను ఆటోలు, అద్దె వాహనాల్లో అధికారికంగా ప్రారంభించారు. మోహన్ బాబు యూనివర్సిటీతో కలిసి ఈ ప్రాజెక్ట్ జరిగింది. సీనియర్ IPS అధికారులు ఎస్.వి. రాజశేఖర్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సింపుల్‌గా వినియోగించే అవకాశం, తక్కువ ఖర్చు కారణంగా ఈ సిస్టమ్ ప్రశంసలు అందుకుంది. ప్రయాణికుడి దగ్గర క్యూఆర్ కోడ్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఎలాంటి చింత లేకుండా ప్రయాణం చేయొచ్చు. అత్యవసర సమయంలో త్వరిత సహాయం పొందొచ్చు. డ్రైవర్స్‌కు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా ద్వారా జవాబుదారీతనం ఉంటుంది. మంచి పనికి ప్రోత్సాహకాలు లభిస్తాయి. పోలీసులు రియల్ టైమ్ ట్రాకింగ్ ద్వారా వెంటనే స్పందిస్తారు. రోడ్డు భద్రత మెరుగవుతుంది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లు జోడించి, రవాణా శాఖతో కలిసి మరింత విస్తరించాలని యోచిస్తున్నారు.

Next Story