viral video : ఓర్నీ.. లక్ (Luck) అంటే నీదే పో..! AC వాహనంలో నిద్రపోతూ ఊరంతా తిరగడమే అతని ఉద్యోగమట!

by Javid Pasha |   (  Updated:2025-04-23 06:25:49  IST  )

viral video : ఓర్నీ.. లక్ (Luck) అంటే నీదే పో..! AC వాహనంలో నిద్రపోతూ ఊరంతా తిరగడమే అతని ఉద్యోగమట!

viral video : ఓర్నీ.. లక్ (Luck) అంటే నీదే పో..! AC వాహనంలో నిద్రపోతూ ఊరంతా తిరగడమే అతని ఉద్యోగమట!
X

దిశ, ఫీచర్స్ : ఉద్యోగమంటే ఊరికేనే రాదు. దానికోసం ఎంతో కష్టపడాలి. తీరా వచ్చాక కూడా అక్కడ రాణించాలంటే తగిన నైపుణ్యం కలిగి ఉండాలి. అందుకే యువతీ యువకులు ముందు నుంచే ప్రిపీర్ అవుతుంటారు. ముఖ్యంగా తమ డ్రీమ్ జాబ్స్(dream jobs) సంపాదించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ నీ డ్రీమ్ జాబ్ (dream job) ఏంటి చెప్మా? అని ఎవరినైనా అడిగితే ‘డాక్టర్, ఇంజినీర్, ప్రొఫెసర్, టీచర్’ ఇలా రకరకాల ప్రొఫెషనల్ కెరీర్స్ గురించే చెబుతుంటారు చాలా వరకు. కానీ ఓ యువకుడు మాత్రం ఏసీ వాహనంలో పడుకొని ఊరంతా తిరగడమే తన డ్రీమ్ జాబ్ అంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ సమాచారం ప్రకారం.. రోడ్డు మీద నుంచి ఒక డిస్‌ప్లే ట్రక్ వెళ్తోంది. అందులో సెట్టింగ్స్ అన్నీ అచ్చం ఇంట్లో ఉన్నట్లు ఉన్నాయి. ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. దీంతోపాటు గోడకు ఒక టీవీ కనిపిస్తుండగా.. ఎదురుగా మంచం, దానిమీద మెత్తటి పరుపు ఉంది. ఇక అందులోని బెడ్‌పై ఒక యువకుడు ప్రశాతంగా నిద్రపోతున్నాడు. చూస్తుంటే ఆ కదులుతున్న వాహనంలో గల ఏసీ రూములోని బెడ్‌పై అతనికి జోలపాడినట్టు సౌకర్యంగా ఉండొచ్చునేమో అందుకే అంత బాగా నిద్రపోతున్నాడు అనిపించక మానదు.

అయితే కదులుతున్న వాహనంపై వెనకాల డోమినీ.ఇన్(Domini. In.) అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానికి ‘my dream job in bangalore’ అని ఒకచోట, ‘one guy gets paid to sleep’ అని మరోచోట రాసి ఉంది. ఇది చూసిన నెటిజన్లు ‘లక్ (Luck) అంటే నీదే బ్రో.. మాక్కూడా అలాంటి జాబ్ కావాలి’ అంటూ ఫన్నీగా, చమత్కారంగా స్పందిస్తున్నారు. కాగా ఇది బెంగుళూరులోని స్లీప్ సొల్యూషన్ కంపెనీ వేక్ ఫిట్ క్యాంపెయిన్‌కు సంబంధించినది కావచ్చునని పలువురు పేర్కొంటున్నారు.

Next Story