అడవిలో అన్న.. గిరిజనుల గుండె ఆజాద్‌వాడీ.!

by Daayi Srishailam |

వందలాది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు

అడవిలో అన్న.. గిరిజనుల గుండె ఆజాద్‌వాడీ.!
X

దిశ, ఫీచర్స్: నేర్చుకో.. నేర్చుకో అని వెంటపడితే ఏం నేర్చుకుంటారు.? నేర్చుకునే మౌలిక సదుపాయాలు.. అవకాశాలు అన్నింటికంటే ముఖ్యం ఆ స్వేచ్ఛను కల్పించాలి. ఆ అవకాశం లేక ఆజాద్ అనే యువకుడు చదువులో రాణించలేక పోయాడు. టాలెంట్ లేక వెనకబాటు పడలేదు. సరైన మార్గంలో తీసుకెళ్లలేక అతడు రాణించకలేక పోయాడు. ఆ యువకుడే ఇప్పుడు వందలాది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఎలాగంటే..

చదువంటే జీవిత పాఠం..

ఉదయపూర్‌లోని చిన్న గిరిజిన గూడెం లోయ. అక్కడి పిల్లలు బాగనే చదువుకుంటారు. కానీ పుస్తకాలు కనిపించవు. ఎలాంటి క్లాసులూ జరగవు. వాటికి బదులుగా తోటలు.. పూల మొక్కలు.. నెమళ్లు.. ఆవులు.. మేకలు కనిపిస్తాయి. వాటిచుట్టూ పిల్లలు పరిగెత్తుతూ ఆనందంగా గడుపుతుంటారు. ఇదంతా చూస్తే "ఇదేం స్కూల్ వయా" అనిపిస్తుంది ఎవరికైనా. అదే "అజాద్‌వాడి". దాని అర్థం "స్వేచ్ఛా లోయ". "ఆజాద్‌వాడీ"లో చదువనేది కేవలం అక్షరాలకు పరిమితమైంది కాదు. వాళ్ల దృష్టిలో జీవితమంతా పాఠమే. జీవితాంతం నేర్చుకోవడమే అనే భావన ఉంటుంది.

ఫెయిల్యూర్ క్యాండిడేట్..

"ఆజాద్‌వాడీ" పాఠశాలను స్థాపించింది ఆజాద్ అనే యువకుడు. అతడికెందుకో చిన్నప్పటి నుంచీ చదువు పెద్దగా అబ్బలేదు. కానీ ఏ విషయమైనా ఇట్టే చెప్పేవాడు. ఒకరకంగా ఏక సంతాగ్రహి. కానీ ఏడు స్కూ్ళ్లు మారాల్సి వచ్చింది. కాలేజీలు కూడా రెండు మార్చాడు. అతడు ఎక్కడ చదువుకున్నా అదేంటోగానీ ఏ విద్యాసంస్థలో కలిసి రాలేదు. ప్రతీసారి.. ప్రతీచోటా "ఫెయిల్యూర్ క్యాండిడేట్" అనే ముద్ర పడేది. కానీ అది తన తప్పుకాదు.. వ్యవస్థ తప్పు అని గ్రహించాడు ఆజాద్. తనను తాను నిందించుకోలేదు. అలాగనీ వ్యవస్థనూ నిందించలేదు. వ్యవస్థలో ఉన్న లోపాలను మాత్రం ఎత్తిచూపే ప్రయత్నం చేశాడు.

ఆజాద్‌వాడీ ఆలోచన..

చదువులో ఎదురైన చేదు అనుభవాల వల్ల దాన్ని వదిలేసి బాక్సింగ్ పట్ల ఆసక్తి ఏర్పరచుకొని బాగనే రాణించాడు. అంతేకాదు జాతీయస్థాయికి కూడా చేరుకున్నాడు. దురదృష్టవశాత్తు గాయమైంది. దాంతో ఆ కలకూడా చెదిరిపోయింది. అసలేం చేయాలి.. ఏ మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తూ రెండేళ్లపాటు అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ఆ జనాల మధ్యే ఉండిపోయాడు. అక్కడ నేర్చుకున్న విలువలే ఆజాద్‌ను అసలైన మార్గంలో నడిచేలా ప్రేరేపించాయి. అసలు విద్య అంటే పాఠశాలలో కాదు.. పొలాలు.. అడవుల్లో అని గ్రహించాడు. ఆ భావనలోంచే ఆజాద్‌వాడీ రూపుదిద్దుకుంది.

ఎకో కిచెన్ వర్క్‌షాప్‌లు..

ఆజాద్ మొదట గుర్గావ్‌లో అటవీ పాఠశాలను ఏర్పాటుచేశాడు. అదిప్పుడు ఉదయపూర్‌ అడవుల్లో స్థిరపడింది. ఇక్కడ పిల్లలు చదువులో భాగంగా బొమ్మలు వేయడం.. మట్టితో ఆకృతులు చేయడం.. ఇండ్లు కట్టడం.. కూరగాయలు పెంచడం నేర్చుకుంటారు. పేరెంట్స్ ఆందోళన చెందినా అతడిపై నమ్మకంతో ఓకే అనడంతో అజాద్‌వాడీ ఒక జీవించే తరగతి గదిగా మారింది. ఇక్కడ చదువు పరీక్షల కోసం కాదు. జీవితం కోసం నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు. అజాద్‌ ప్రయాణం ఇంతటితో ఆగలేదు. ఎకో కిచెన్ వర్క్‌షాప్‌లు.. గ్లోబల్ ఎకో ఎడ్యుకేషన్ నెట్‌వర్క్‌తో కలసి లోకల్ టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్తున్నాడు.

Next Story