- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New study : ఇది తెలుసా ? గర్ల్ ఫ్రెండ్ ఉన్న పురుషుల విషయంలో చివరికి ఏం జరుగుతుందో..!
New study : ఇది తెలుసా ? గర్ల్ ఫ్రెండ్ ఉన్న పురుషుల విషయంలో చివరికి ఏం జరుగుతుందో..!

దిశ, ఫీచర్స్ : మీకీ విషయం తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం! ఇంతకీ ఏంటంటే.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, తమకంటూ ఒక సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్(Girlfriend) కలిగి ఉన్న పురుషులు పదేండ్లు ఎక్కువకాలం జీవిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)కి చెందిన మానసిక నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించి అదే సంఖ్య కచ్చితమైనదని వారు నిర్ధారించనప్పటికీ, పదేండ్లు ఎక్కువకాలం జీవిస్తారనే అంచనా వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు పరిశోధకులు.
సాధారణంగా సన్నిహితమైన, ప్రేమ పూర్వక సంబంధాల(Loving relationships)ను కలిగి ఉన్న వ్యక్తులు మిగతా వారితో పోలిస్తే జీవితంలో ఆనందంగా(happily) ఉంటారని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. ‘స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్‌మెంట్’ అంశంపై చాలా కాలంగా పరిశోధనలు నిర్వహిస్తున్న వీరు సన్నిహిత సంబంధాలు జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తాయని(Reduces stress), మానసిక స్థిరత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
ప్రేమ పూర్వక సంబంధాలు సహజంగానే జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తాయని, దీర్ఘాయుష్షుకు కారణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్(Supportive girlfriend) కలిగి ఉన్న పురుషుల విషయంలోనూ అదే జరుగుతుందని, ఎక్కువ ఆనందం, భావోద్వేగ మద్దతు(Emotional support) లభించడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ఇది మానసిక ఆరోగ్యంతోపాటు గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాల రిస్క్‌ను నివారించడంలో పరోక్షంగా సహాయపడుతుందని అంటున్నారు.






