- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురి పెళ్లికి తల్లికి మేకప్.. అసలు సంగతి తెలిస్తే షాక్! (వీడియో)
తన తల్లికి మేకప్ చేయడం నెటిజనులను ఆకర్షించింది. Shows how a bride does her mom's makeup..

దిశ, వెబ్‌డెస్క్ః ఇటీవల ఒక వధువు వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, దానికి దాదాపు రెండు మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. ఇంతగా వైరల్ అయిన ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన సంగతి ఏంటంటే.. పెళ్లిలో సాధారణంగా వధువుకు మేకప్ వేయడానికి సగం సమయం పడుతుంది. కదలకుండా గంటల తరబడి ఆమె కూర్చోవాల్సి వస్తుంది. కానీ, ఇక్కడ అందమైన ఈ వధువు, తన పెళ్లి రోజున తన తల్లికి మేకప్ చేయడం నెటిజనులను ఆకర్షించింది. "ఓ అమ్మ తన అలంకరణ కోసం వధువు అయిన తన కుమార్తెనే నమ్మితే.." అనే క్యాప్షన్‌తో వీడియో మొదలవుతుంది. అయితే, ఈ వధువు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాగర్. ఆమె పేజీలో 1,700 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీళ్లంతా ఆమెను తెగ పొగిడేస్తున్నారు. నీ పెళ్లిలో నీ తల్లికి మేకప్ చేస్తూ ఎంత ముచ్చటగా ఉన్నావో అంటూ ప్రశంసిస్తున్నారు.
మెట్రోలో సీటు కోసం ఇద్దరు ఆడోళ్ల మధ్య కొట్లాట..! (వీడియో)






