- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు..ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు
A video of hawks chasing a lion has gone viral

దిశ, వెబ్ డెస్క్:Viral Video: తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడని..అంటే ఈ సామెత అర్థం ఒకరిని మోసం చేసిన వాడిని మరొకడు మోసం చేస్తాడని. తాటిచెట్టును తన్నడానికి బలం అవసరం. అలాంటి తాటి చెట్టును తన్నగలిగేవాడు ఉంటే..వాడి తలను తన్నగలిగే వాడు కూడా ఉండే అవకాశం ఉంటుందనేది ఈ సామెతకు మరో రూపం. ఇందంతా ఎందుకు చెబుతున్నట్లు అంటే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో సింహం.. గద్దను వెంటపడి.. వేటాడుతుంది. సింహం నుంచి తప్పించుకునేందుకు గద్ద ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ చివరికి సింహానికి చిక్కుతుంది.
అయితే అదే సింహానికి మరో రెండు గద్దలు చుక్కలు చూపిస్తాయి. సింహాన్ని చుట్టుముట్టి పొడుస్తుంటాయి. గద్దల నుంచి కాపాడుకునేందుకు సింహం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ చివరికి విఫలం అవుతుంది. ఈ గద్ద, సింహం వీడియో చూస్తుంటే ఈ రోజు నీది కావచ్చు..కానీ రేపు మాత్రం కాదనే అర్థం దాగి ఉంది. నిజ జీవితంలో కూడా ఇలాంటి మనుషులు ఎదురువుతుంటారు. Janardhan Goud అనే వ్యక్తి పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు!
— Janardhan Goud (@janardhangoud_t) April 16, 2025
ఈరోజు నీది కావచ్చు కాని రేపు మాత్రం కాదు🫵#Telangana #BRSSM pic.twitter.com/pc0MVpITtZ






