- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ అది చేతిలో పట్టుకొని నగర వీధుల్లో తిరుగుతున్న యువకుడు.. అది చూసి ఆ యువతులు ఏం చేశారంటే..
Viral video : గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ అది చేతిలో పట్టుకొని నగర వీధుల్లో తిరుగుతున్న యువకుడు.. అది చూసి ఆ యువతులు ఏం చేశారంటే..

దిశ, ఫీచర్స్ : తమలోని ఆలోచనలు పంచుకోవడానికి, క్రియేటివిటీని, టాలెంట్‌ను నిరూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. సోషల్ మీడియా(Social media) హవా నడుస్తున్న ఈ రోజుల్లో అది మరింత ఈజీ అయిపోయింది. రకరకాల కంటెంట్‌తో ఇన్‌ఫ్లుయెన్సర్లు(Influencers) ప్రజలను అలరిస్తున్నారు. ఇక అప్పుడప్పుడూ వైరల్ అయ్యే కొన్ని వీడియోలైతే ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటాయి. కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఆ కోవకు చెందిన వీడియో(Viral video) ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే..
*అది రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సిటీ(Jaipur City). వచ్చీ పోయే జనాలతో, వాహనాలతో వీధులు, రోడ్లు బిజీ బిజీగా ఉన్నాయి. అయితే ఇంతలోనే సెడన్‌గా ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. చేతిలో ఓ పోస్టర్‌ను పట్టుకొని అక్కడికి వచ్చి రోడ్డులో నిలబడ్డాడు. ఇక ఆ దారిలో వచ్చీపోయే జనాలు, ముఖ్యంగా యువతీ యువకులు అతన్ని చూస్తూ ముసి ముసి నవ్వుతూ వెళ్తున్నారు. ఎందుకంటే.. యువకుడు పట్టుకున్న పోస్టర్‌పైన ‘I Need a Girlfriend’ అని రాసి ఉంది. దాని పకప్కనే ఓ పిల్లవాడు ఏడుస్తున్న ఫొటో ఉండి, దాని కింద హిందీలో ‘పురానీ భాగ్ గయి’ అంటే మాజీ గర్ల్ ఫ్రెండ్ పారిపోయింది అని, దాని కింద pinkcity.monumeena రాసి ఉంది.
*ఇక ‘I Need a Girlfriend’ అంటూ ఆ యువకుడు ప్రదర్శిస్తున్న పోస్టర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ, అతను చేసిన పనికి ఆశ్చర్యపోతూ అటు నుంచి వెళ్తున్నారు. కొందరు ఫొటోలు తీసుకుంటున్నారు. ఇక ఆటోలో వెళ్తున్న ఒక జంట అయితే వావ్ భలే ఉందన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, చిరు నవ్వు చిందిస్తూ విక్టరీ సింబల్‌ను చూపుతూ వెళ్లిపోయింది. pinkcity.monumeena@Monu Gomladu అనే ఇన్‌స్టా హ్యాండిల్లో ఈ వీడియో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి!






