వాతావరణ మార్పులపై లైవ్ ట్వీట్స్ చేస్తున్న చెట్టు

by Chukka Sudharani |   (  Updated:2022-09-10 09:36:54  IST  )

ఆశ్చర్యకరంగా ఒక చెట్టు వాతావరణ సంక్షోభాన్ని రియల్ టైమ్‌లో రికార్డ్ చేస్తోంది. యూఎస్‌లోని పీటర్‌షామ్ ఫారెస్ట్ మధ్యనున్న 87 అడుగుల పొడవైన నార్తర్న్ రెడ్ ఓక్ ట్రీ చూసేందుకు సాధారణంగానే కనిపిస్తుంది.

వాతావరణ మార్పులపై లైవ్ ట్వీట్స్ చేస్తున్న చెట్టు
X

దిశ, ఫీచర్స్ : ఆశ్చర్యకరంగా ఒక చెట్టు వాతావరణ సంక్షోభాన్ని రియల్ టైమ్‌లో రికార్డ్ చేస్తోంది. యూఎస్‌లోని పీటర్‌షామ్ ఫారెస్ట్ మధ్యనున్న 87 అడుగుల పొడవైన నార్తర్న్ రెడ్ ఓక్ ట్రీ చూసేందుకు సాధారణంగానే కనిపిస్తుంది. కానీ అసాధారణ పనితీరుతో వాతావరణ మార్పులను ప్రత్యక్షంగా ట్వీట్ చేస్తోంది. హార్వర్డ్ ఫారెస్ట్‌కు చెందిన ఒక బృందం ఈ చెట్టుకు సెన్సార్లతో వైరింగ్ చేసింది. ఈ ఏర్పాటు చెట్టు మాట్లాడేందుకు సాయపడే డేటాను కోడ్‌లోకి అందించబడుతుంది.

ఈ రెడ్ ఓక్ చెట్టు ఉష్ణోగ్రతల(రియల్ హాట్ డేస్, రియల్ కోల్డ్ డేస్) గురించి వివరిస్తుందని హార్వర్డ్ ఫారెస్ట్ ఔట్ రీచ్ డైరెక్టర్ క్లారిస్సే హార్ట్ అన్నారు. రియల్ టైమ్‌లో చెట్టును పర్యవేక్షించే గ్రోత్ సెన్సార్‌తో పాటు చెట్టు పైకి, కిందకు ఎంత ద్రవం ప్రవహిస్తుందో అంచనా వేయడానికి ఈ 'ట్విట్టర్ ట్రీ' సాప్ ఫ్లో సెన్సార్‌తో అమర్చబడింది. చెట్టు పై భాగంలోని ఆకులను కొలిచేందుకు చిత్రాలను తీసేందుకు కెమెరా కూడా ఉంది. ఈ రెండింటి సమన్వయంతో వెలువడే డేటా కోడ్‌గా మార్చబడి 'విట్‌నెస్ ట్రీ' ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయబడుతుంది.

ఉదాహరణకు యూఎస్‌లోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనపుడు ఆగస్టులో ఈ చెట్టు జబ్బుపడింది. అంతేకాదు సుమారు వందేళ్ల వయసున్న ఈ చెట్టు ఇలంటి అనేక వాతావరణ ఘటనలకు సాక్షిగా ఉంది. 1938లో గ్రేట్ న్యూ ఇంగ్లాండ్‌ హరికేన్‌ను తట్టుకుని మరీ మనుగడ సాగించగలిగింది. అయితే దాని చుట్టుపక్కల చెట్లు పడిపోయిన తర్వాతే ఇది కొద్ది కొద్దిగా పెరిగింది. కాగా ఇలాంటి కొత్త పద్ధతులు వేగంగా మారుతున్న వాతావరణంపై దృష్టి సారించడమే కాక శతాబ్దానికి పైగా జీవించిన చెట్లను రక్షించడానికి త్వరితగతిన చేపట్టాల్సిన చర్యల అవసరాన్ని హైలైట్ చేస్తాయని హార్ట్ పేర్కొన్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి

సంతానలేమికి యూనిక్ ప్రొటీన్.. కనుగొన్న సైంటిస్టులు

Next Story