Trends : నాట్ ఇంట్రెస్టెడ్.. రిలేషన్‌షిప్స్‌లో నయాపోకడలు.. తగ్గుతున్న లవ్.. రొమాన్స్!

by Javid Pasha |

Trends : నాట్ ఇంట్రెస్టెడ్.. రిలేషన్‌షిప్స్‌లో నయాపోకడలు.. తగ్గుతున్న లవ్.. రొమాన్స్!
X

దిశ, ఫీచర్స్ : అనుబంధాలు ఎలా పెనవేసుకుంటాయో కానీ.. కొందరి జీవితంలో ఆనందాన్ని పెంపొందిస్తాయి. ప్రేమానురాగాలను ప్రేరేపిస్తాయి. చిన్న చిన్న ఒడిదుడుకలున్నా సర్దుపోయేలా సానుకూలతను ప్రోత్సహిస్తాయి. కానీ ఇటీవల ‘వన్‌పోల్’ నిర్వహించిన ఒక సర్వే మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా సంబంధాల్లో కొత్త మార్పులు, కొత్త పోకడలు కనిపిస్తున్నాయని పేర్కొన్నది. ముఖ్యంగా రిలేషన్‌షిప్స్‌లో జీవిత భాగస్వాముల మధ్య ప్రేమానురాగాలు, లైంగిక జీవితంపట్ల ఆసక్తి గతంకంటే తగ్గుతున్నాయని తెలిపింది. ఈ విధమైన మార్పు ఎందుకు వస్తోంది? అందకు కారణాలేమిటో చూద్దా పదండి!

ఆధునిక సంబంధాలను విశ్లేషించే అధ్యయనంలో భాగంగా వన్‌పోల్ సంస్థకు చెందిన నిపుణులు మొత్తం 5000 మందిని వారి వ్యక్తిగత జీవితంలో ప్రేమ, ఆనందం, శృంగారం వంటి అంశాలపట్ల ప్రశ్నించగా కేవలం 36 శాతం మంది మాత్రమే లైఫ్ పార్టనర్‌తో శృంగార జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది. అంతేగాక ప్రతీ ఐదుగురు అడల్ట్స్‌లో ఒకరు మూడేండ్ల కంటే ఎక్కువ సమయం ఒకే రిలేషన్‌షిప్‌లో ఉండటంపట్ల సంతృప్తిగా ఉండటం లేదు. ఒకే జీవిత భాగస్వామితో లవ్, సెక్స్ పరంగా సంతృప్తి లేకపోవడమే ఇందుకు కారణమని కూడా పలువురు అభిప్రాయపడుతున్నట్లు సర్వే పేర్కొన్నది.

మూడింట ఒకవంతు జంటలు తాము టీనేజీలోకి అడుగు పెట్టగానే డేటింగ్ ప్రారంభిస్తున్నారని సర్వే పేర్కొన్నది. మసాచుసెట్స్, న్యూయార్క్, వ్యోమింగ్‌లలో 50% శాతంమందిని ప్రశ్నించగా 38% మంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటువంటి పరిస్థితి కూడా భాగస్వాముల మధ్య తర్వాత అసంతృప్తికి కారణం అవుతోంది. చాలా మంది ఏదో తప్పదు అన్నట్లుగానో, హోప్ లెస్‌గానో తమ రొమాంటిక్ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక ఉటాలో 35% శాతం మంది, ఓక్లహోమా 34% మంది, వెస్ట్ వర్జీనియా 32% మంది, పెన్సిల్వేనియా, మిస్సౌరీలలో 32% చొప్పున, కాలిఫోర్నియా 36 శాతం మంది తమ జీవితంలో లవ్, రొమాన్స్ అనుకున్నంత సంతృప్తిగా లేదని పేర్కొంటున్నారు.

అమెరికన్ జంటల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరు తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నాడని చెప్పారు. ఇలా మోసపోయిన వారిలో విస్కాన్సిన్‌కు చెందిన వారు ఎక్కువగా 52% మంది ఉన్నారు. అమెరికాలో సగటు ఒక వ్యక్తి తన జీవితకాలంలో నలుగురితో సీరియస్‌గా డేటింగ్ చేసినట్లు కూడా సర్వేలో తేలింది. ఒకే వ్యక్తితో కొనసాగేవారు చాలా అరుదు. అయితే ఇల్లినాయిస్(from Illinois) చెందినవారిలో మాత్రం చాలామంది ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటున్నారు. కాగా భారత దేశంలో ఈ ప్రభావం గురించి సర్వే ప్రస్తావించకపోగా, ఇక్కడ ఆ ప్రభావం ఉండదని, కాకపోతే ఇటీవల కొత్త పోడకలు రిలేషన్‌షిప్స్‌లో ఒడిదుడుకులకు కారణం అవుతున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు.

Next Story