అడిక్ట్ అయ్యాం బ్రో..! Gen Z లో సోషల్ మీడియా వ్యసనం

by Javid Pasha |

ఒక సర్వే ప్రకారం 82% Gen Z తాము సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యామని భావిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లు యువతను ఆకట్టుకోవడానికి ఉద్దేశ పూర్వకంగా డిజైన్ చేయబడుతున్నాయని చెబుతున్నారు

అడిక్ట్ అయ్యాం బ్రో..! Gen Z లో సోషల్ మీడియా వ్యసనం
X

దిశ, ఫీచర్స్ : ఈతరం యువత (Gen Z) సోషల్ మీడియాపై ఎక్కువగా డిపెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అదొక వ్యసనంగా కూడా మారుతోందా?.. అవుననే అంటోంది ‘The Harris Poll’ అనే ఒక అమెరికన్ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే/అధ్యయనం. దీని ప్రకారం 82% జెన్‌జీలు తాము సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యామని భావిస్తున్నారు. ఇది కేవలం స్క్రీన్ టైమ్ విషయం మాత్రమే కాదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు యువతను ఆకట్టుకోవడానికి ఉద్దేశ పూర్వకంగా డిజైన్ చేయబడుతున్నాయని, లైక్స్, కామెంట్స్, నోటిఫికేషన్స్ ద్వారా డోపమైన్ హిట్స్ ఇచ్చి వినియోగదారులను ఎక్కువసేపు ఆకర్షించి ఉంచుతాయని సర్వే పేర్కొన్నది. ఇండియాలోనూ ఈ ధోరణి కనిపిస్తున్నదని సర్వేను విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు.

ఇతరులతో పోల్చుకోవడం..

సోషల్ మీడియాను అవసరాన్ని బట్టి ఒక లిమిటేషన్‌లో ఉపయోగించుకోవడం ఎంతో మేలు చేస్తున్నప్పటికీ, అనేకమంది యువత దుర్వినియోగం చేస్తూ వ్యసనానికి లోనవుతున్నారని కూడా నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా యువతలో స్వీయ-చిత్రం (Self-image or Body image), సంబంధాలు, స్వీయ-విలువలు కూడా మారిపోతున్నాయని పేర్కొంటున్నారు. ఆయా సోషల్ మీడియా వేదికల్లో ఎడిట్ చేసిన క్యూరేటెడ్ జీవితాలను, కంటెంట్‌ను చూసి పలువురు తమను తాము పోల్చుకోవడం, అందులో చూపిన వాలిడేషన్ కోసం ఆశపడటం వల్ల నిజమైన జీవితంలో సంతృప్తి తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీవితంలో లేదా చేస్తున్న పనిలో ఫోకస్, ఓపిక, భావోద్వేగ లభ్యత (Emotional availability) వంటి అంశాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటున్నారు.

సమయం, సామర్థ్యం‌పై ప్రభావం

మరో విషయం ఏమిటంటే.. ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపడంవల్ల నిజమైన సంబంధాలు, ముఖాముఖి సంభాషణలు, ఓపికగా లేదా ఓర్పుగా ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతున్నాయని సర్వే పేర్కొన్నది. సోషల్ మీడియా అడిక్షన్ మన సమయాన్ని, శ్రద్ధను, వ్యక్తిగత ఎదుగుదలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆ సర్వేను విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జెన్ Z లోనే ఇది అధికంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియా మిమ్మల్ని కంట్రోల్ చేసే విధంగా కాకుండా, సోషల్ మీడియాను మీ ముఖ్యమైన ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. విషయాలపట్ల అవగాహనతో, క్లారిటీతో పరిమితిగా, సమతుల్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలా కాకుండా దుర్వినయోగం చేయడం, అతిగా ఆధారపడటం మాత్రం మీలో వ్యవసనాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే బీ కేర్‌ఫుల్! అంటున్నారు నిపుణులు.

Next Story