- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Complicated : తలనొప్పి వస్తోందంటూ పిల్లలు హోమ్ వర్క్ చేయడం లేదా ? పేరెంట్స్.. బీ కేర్ ఫుల్!
Complicated : తలనొప్పి వస్తోందంటూ పిల్లలు హోమ్ వర్క్ చేయడం లేదా ? పేరెంట్స్.. బీ కేర్ ఫుల్!

దిశ, ఫీచర్స్ : బడి నుంచి వచ్చాక పిల్లలు హోం వర్క్ చేసుకోవడం, చేసుకోవాలని పేరెంట్స్ సూచించడం సహజమే. ఈ సందర్భంగా పిల్లలు కాసేపు ఆడుకున్నాక చేస్తామని చెబుతుంటారు. మరికొందరు హోం వర్క్ అయ్యాక ఆడుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇదంతా కామన్. కానీ హోమ్ వర్క్ చేస్తున్నప్పుడో, చేయాలని చెప్పినప్పుడో మీ పిల్లలో ఏదో నిరాశా, నిరుత్సాహం కనిపిస్తున్నాయా? పుస్తకాలు ముందు వేసుకోగానే తలనొప్పి వస్తోందని ఫిర్యాదు చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. సాకులు చెప్పొద్దు అని మాత్రం బెదిరించకండి. ఎప్పుడో ఒకసారి అయితే వారు సాకులు చెబుతున్నారని అనుకోవచ్చు. కానీ అలా చెబుతుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఐదారేండ్లలోపు పిల్లలు అధిక ఒత్తిడికి, బెదిరింపులకు గురైనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
తలనొప్పి వస్తోందని పిల్లలు ఫిర్యాదు చేయగానే ఏదో తప్పించుకోవడానికి అలా చేస్తున్నారని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కాస్త ఓపికగా.. పిల్లలను దగ్గరగా తీసుకొని ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. పిల్లల్లో వివిధ మూడ్ డిజార్డర్స్‌కు, ముఖ్యంగా తలనొప్పికి ప్రత్యేక కారణాలు ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. మానసిక వేదన, ఆందోళన, బెదిరింపులను ఎదుర్కోవడం వంటివి 5 నుంచి 12 ఏండ్లలోపు పిల్లల్లో తలనొప్పికి కారణం అవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 23 వేలమంది యుక్త పిల్లలను రీసెర్చర్స్ హోమ్ వర్క్ సమయంలో తలనొప్పికి గల కారణాలు, పిల్లలు ఎందుకలా చెబుతున్నారనే విషయాలను విశ్లేషించారు.
నిపుణుల పరిశీలనలో 11 శాతం మంది పిల్లలు స్కూళ్లలో లేదా బయట పరిసరాల్లో ఫ్రెండ్స్ ద్వారా, ఇంటి చుట్టు పక్కల నివసించే వ్యక్తులవల్ల ఎదురయ్యే ఇబ్బందులు, హెచ్చరికలు, బెదిరింపుల కారణంగా ఆందోళన చెడుతున్నట్లు తేలింది. ఈ పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొనే బాధిత పిల్లల్లో కొంతకాలానికి తలనొప్పి సమస్య ప్రారంభమైనట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ప్రతీ నలుగురిలో ఒకరు బహిరంగ బెదిరింపుల వల్ల తలనొప్పి బారినపడుతున్నారు. ఇక అవమానాలు, ఇంట్లో తరచూ ఫ్యామిలీ గొడవలు, హెచ్చరికల కారణంగా 17 శాతం మంది తలనొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. అందుకే పేరెంట్స్ బీ కేర్ ఫుల్. పిల్లలు ఏదైనా విషయంలో ఫిర్యాదు చేయగానే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, దానివెనుక గల కారణాలను లోతుగా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.






