- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోం వర్క్‌తో పాటు ఆ విషయాల్లో క్లారిటీకోసం.. Chat GPT, AIలను యూజ్ చేస్తున్న పిల్లలు
హోం వర్క్‌తో పాటు ఆ విషయాల్లో క్లారిటీకోసం చాట్ జీపీటీ, ఏఐలను యూజ్ చేస్తున్న పిల్లలు

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ తెచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఉపయోగించడం తెలిస్తే చాలు. ఇది అనేక విషయాల్లో పిల్లలు పెద్దలు తేడా లేకుండా కంఫర్ట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా చాట్‌జీపీటీ, స్నాప్ చాట్‌కు సంబంధించిన మై ఏఐ, అలాగే క్యారెక్టర్ ఏఐ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I) చాట్‌బాట్‌లను ఇటీవల పిల్లలు తెగ ఉపయోగిస్తున్నట్లు యూకేకు చెందిన ‘ఇంటర్నెట్ మ్యాటర్స్’ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా హోంవర్క్‌తోపాటు పలు అనేక విషయాల్లో అనుమానాల నివృత్తికి పిల్లలు ఈ మోడ్రన్ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.
కేవలం హోంవర్క్ సహాయం కోసం మాత్రమే కాకుండా, 16 ఏండ్లలోపు పిల్లల్లో చాలా మంది ఎమోషనల్ అడ్వైజ్(emotional advice ) కోసం, మానసిక సాంగత్యం కోసం కూడా ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నట్లు 1,000 మంది పిల్లలపై ఇంటర్నెట్ మ్యాటర్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 64% మంది పిల్లలు తాము ఏఐ చాట్‌బాట్‌లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తామని చెప్పినట్లు పేర్కొన్నది. వీరిలో చాలా మంది చాట్‌బాట్‌లను తమ స్నేహితుల్లా భావిస్తున్నారట.
ప్రతీ ఆరుగురిలో ఒకరు, అంటే సుమారు 16.67% మంది పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏఐ చాట్‌బాట్‌ల వైపు మొగ్గుతున్నారని కూడా అధ్యయనం పేర్కొన్నది. అంతేకాకుండా దాదాపు 15% మంది పిల్లలు నిజమైన వ్యక్తులతో మాట్లాడటం కంటే కూడా చాట్‌బాట్‌లతో సంభాషించడానికి ఇష్టపడుతున్నారని తెలిపింది. కొందరు పిల్లలు ఏఐతో చాట్ చేసే సందర్భంలో ఫ్రెండ్‌తో మాట్లాడిన భావనకు గురవుతున్నట్లు భావిస్తున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడయాలో వైరల్ అవుతుండగా.. టెక్నాలజీ ఇంకెన్ని మార్పులు తెస్తుందో వేచి చూడటం తప్ప, చేసేదేం లేదని పలువురు పేర్కొంటున్నారు. Link






