- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sleeping Habits : ఆలస్యమే అమృతం..! లేటుగా నిద్ర లేచేవారిలోనే IQ ఎక్కువట!!
Sleeping Habits : ఆలస్యమే అమృతం..! లేటుగా నిద్ర లేచేవారిలోనే IQ ఎక్కువట!!

దిశ, ఫీచర్స్ : మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయాన్నే నిద్రలేవాలంటారు పెద్దలు. గత అధ్యయనాలు సైతం ఇదే చెప్పాయి. సూర్యోదయానికి ముందు నిద్రలేవడంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని పేర్కొన్నాయి. కానీ తాజా అధ్యయనం మాత్రం అందుకు భిన్నమైన ఫలితాన్ని వెల్లడించింది. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్రలేచేవారు, త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్రలేచేవారికంటే ఎక్కువ ఐక్యూ(“intelligence quotient)ను కలిగి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దామా!
గత అధ్యయనాలకు భిన్నంగా..
నిద్ర అలవాట్లు ఆయా వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE)కు చెందిన ప్రముఖ సైకాలజిస్టు (psychologist) డాక్టర్ సతోషి కనజావా (Dr. Satoshi Kanazawa) నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఇటీవల మరోసారి అధ్యయనం నిర్వహించింది. కాగా ఈ టీమ్‌లోని నిపుణులు నిద్ర విషయంలో గత అధ్యయనాలను సవాలు చేసే ఫలితాన్ని వెల్లడించారు. సాధారణంగా త్వరగా నిద్రలేవడం మంచిదని గత పరిశోధనలు పేర్కొనగా, వీరు మాత్రం ఆలస్యంగా నిద్రమేల్కోవడం మంచిదని, క్రియేటివిటీకి నిదర్శనమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘the journal Personality and Individual Differences’లో పబ్లిష్ అయ్యాయి.
కారణం ఇదే..
తమ పరిశీలన ప్రకారం.. ఆలస్యంగా నిద్రలేస్తున్న అనేకమంది అధిక ఐక్యూ(IQ) గల వ్యక్తులను పరిశీలించినప్పుడు వీరు తరచుగా తక్కువ ఐక్యూ (IQ) గల వ్యక్తులకంటే ఆలస్యంగా మేల్కొనే ("Night Owl" tendencies)ధోరణిని కలిగి ఉంటున్నారని పరిశోధకులు కనుగొన్నారు. అయితే గత అధ్యయనాలకు భిన్నంగా ఈ పరిశోధన ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఇది మానవ అవసరాలు, ఆధునిక పరిణామాత్మక పురుగోతిని సూచిస్తుందని ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కనజావా పేర్కొంటున్నారు.
ఆలస్యం ఎందుకు మంచిది?
అధ్యయనంలో భాగంగా నిపుణులు వేలాది మంది యువకుల నిద్ర అలవాట్లను, వారి మేధో పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు ప్రామాణిక ఐక్యూ టెస్టులు(standard IQ tests ), స్వీయ నివేదిత నిద్ర అలవాట్లను (self-reported sleep schedules) విశ్లేషించారు. చివరికి తేలిందేమిటంటే.. అధిక మేధో సామర్థ్యం కలిగిన వ్యక్తులు రాత్రిపూట ఎక్కువగా మేల్కొంటూ ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఈ సమయాన్ని వీరు ఆయా సమస్యలను పరిష్కరించడంలో, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో వినియోగించుకుంటున్నారు. కొంత ఒత్తిడిగా అనిపించినప్పటికీ ఫైనల్లీ ఇది ఆయా వ్యక్తుల్లో ఐక్యూను, ప్రొడక్టివిటీని, క్రియేటివిటీని పెంచడంలో సహాయపడుతున్నట్లు గుర్తించారు.






