- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకప్ బాధ.. అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే ఎక్కువ..!
నిపుణులు 1,84,000కు పైగా వ్యక్తుల సంబంధాల గురించి ఆన్‌లైన్ వేదికగా సర్వే నిర్వహించారు. ఫలితాలను విశ్లేషించగా.. బ్రేకప్ సందర్భాల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువ బాధను అనుభవిస్తున్నట్లు గుర్తించారు.

దిశ, ఫీచర్స్ : మనసారా ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే ఎలా ఉంటుంది? సడెన్‌గా మాట్లాడటం ఆపేస్తే.. కనీసం మెసేజ్ కూడా చేయకపోతే.. అది ట్రూ లవ్ అయితే గనుక ఇవతలి వ్యక్తి గుండె పగిలినంత పనవుతుంది. ఇక బ్రేకప్ చెప్పేస్తే మాత్రం ఆ ఫీలింగ్ వర్ణనాతీతం అంటారు కొందరు. అయితే ఈ బాధ అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే ఎక్కువుంటుందని మీకు తెలుసా? ఇంగ్లాండ్ దేశంలోని లంకాస్టర్ యూనివర్సిటీ(Lancaster University) నిర్వహించిన ఒక అధ్యయనం ఇదే వెల్లడించింది. విడిపోయిన తర్వాత మహిళలకంటే.. పురుషులే ఎక్కువ బాధపడతారని తెలిపింది.
*అధ్యయనంలో భాగంగా నిపుణులు 1,84,000కు పైగా వ్యక్తుల సంబంధాల(relationship discussions) గురించి ఆన్‌లైన్ వేదికగా సర్వే నిర్వహించారు. ఫలితాలను విశ్లేషించగా.. బ్రేకప్ చెప్పాక లేదా ఏదైనా కారణాలతో భాగస్వాములు విడిపోయాక వీరిలోమహిళల కంటే పురుషులే ఎక్కువ లోతైన భావోద్వేగ బాధ(Deep emotional pain)ను అనుభవిస్తున్నట్లు గుర్తించారు.
*పురుషుల్లో బ్రేకప్ బాధ అధికంగా ఎందుకు ఉంటుంది? అంటే.. సామాజిక పరిస్థితులు, ఆచారాల వల్ల వీరు తరచుగా తమ ఎమోషనల్ పెయిన్‌ను బయటకు వ్యక్తం చేయలేరు. ఎమోషనల్ సపోర్ట్ కోసం కూడా ఎవరినీ ఆశ్రయించరు. ఒక పురుషుడై ఉండి.. పిరికి వాడిలా బాధపడతావేంటని ఇతరులు అంటారేమోనని చాలామంది తమ బాధను బయటకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ విధమైన స్వీయ భావోద్వేగాల అణచివేతే పురుషుల్లో సహజంగానే ప్రేమ, బ్రేకప్ వంటి విషయాల్లో ప్రభావం చూపుతాయి. బాధను ప్రాసెస్ చేసే మార్గాలు తక్కువగా ఉండటంవల్ల ఆ బాధ ఎక్కువ కాలం కొనసాగుతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలకు దారితీస్తుంది.
*ఇక జీవశాస్త్ర పరంగా (Biologically)చూస్తే, ప్రేమలో ఉన్నప్పుడు మెదడులో సహజంగానే డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అయి మెదడులోని రివార్డ్ మార్గాలను యాక్టివేట్ చేస్తుంది. కానీ బ్రేకప్ లేదా రొమాంటిక్ బంధాన్ని కోల్పోయిన అది బాగా తగ్గుతుంది. ఒక్కసారిగా ప్రియమైన వ్యక్తి దూరం కావడం భావోద్వేగ ఉపసంహరణలా అనిపిస్తుంది. మహిళల్లో మాత్రం ఈ ప్రభావం పురుషుల మాదిరి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీరు సామాజిక సౌకర్యాన్ని(Social comfort) వెతుకుతారు. భావోద్వేగాలను కుటుంబ బయటకు ప్రాసెస్ చేస్తారు. ఇది వారిని త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అయితే పురుషులు లోలోపలే భావోద్వేగాలను అణచివేస్తారు. కాబట్టి ఇది బ్రేకప్ బాధను మరింత పెంచుతుంది. Link






