- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రాప్ ఔట్ విద్యార్థి ఇప్పుడు వేలాదిమందికి దారి చూపుతున్నాడు
డ్రీమ్ అహెడ్.. డ్రాపౌట్ స్టూడెంట్ దార్శనికత

దిశ, ఫీచర్స్: అతడొక మారుమూలు గ్రామానికి చెందిన యువకుడు. చదువులో మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితిలోంచి వచ్చినవాడు. మామూలుగా చదువు మధ్యలో ఆగిపోతే ఏంచేస్తారు.? ఏదో పనికి వెళ్లి సాధారణ జీవితం గడుపుతారు. అంతే కదా.? కానీ ఏపీకి చెందిన క్రాంతి కుమార్ గంటా.. తనలాంటి ఎంతోమందికి కలల క్రాంతి అయ్యాడు. వారి జీవితానికి దిశ.. నిర్దేశనం చేస్తున్నాడు.
చదువులేకున్నా..
క్రాంతికి తనకున్న పరిస్థితుల దృష్ట్యా ఉన్నత విద్య.. ఉద్యోగాలు అందని ద్రాక్షగా కనిపించేవి. దీంతో కాలేజీ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. చదువులో ముందుకెళ్లక పోవచ్చు. కానీ.. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయిగా అనుకున్నాడు. సింపుల్‌గా.. క్లారిటీగా మాట్లాడే నైపుణ్యం అతన్ని మార్కెటింగ్ రంగంలోకి తీసుకెళ్లింది. ఐదేళ్ల పాటు ఎడ్‌టెక్ ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవం ఇంకో అడుగు ముందుకేసేలా చేశాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేక తనలాంటి ఎంతోమంది ఉద్యోగాలు రాక దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి చదివించిన పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారని క్రాంతి గ్రహించాడు.
డ్రీమ్ అహెడ్ లెర్నింగ్ హబ్..
క్రాంతి 2024లో రూ.10 లక్షల పెట్టుబడితో "డ్రీమ్ అహెడ్ లెర్నింగ్ హబ్"ను స్టార్ట్ చేశాడు. విద్యార్థులు.. తల్లిదండ్రులు.. యువ నిపుణులకు స్పష్టమైన గైడెన్స్ అందించే ఎకోసిస్టమ్ ఇది. "ప్రతిరోజూ 1% మెరుగైపోవడమే మా లక్ష్యం" అనే లక్ష్యంతో ఇక్కడ దిశా నిర్దేశనం చెందుతున్నారు. ప్లేస్మెంట్‌తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా కల్పిస్తూ ఎంతో మందికి ఆదాయ మార్గం చూపిస్తున్నాడు క్రాంతి. "డ్రీమ్ అహెడ్" ఇండియాలోని కమ్యూనికేషన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి నాలుగు ప్రత్యేక సేవలను అందిస్తోంది. అవి.. పేరెంటింగ్ క్లబ్.. కెరీర్ క్లబ్.. యూనీకనెక్ట్.. డ్రీమ్ అహెడ్ పిన్‌కోడ్ ఫ్రాంచైజీ.
మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్..
ఒక్క శాతం పేరెంటింగ్ క్లబ్ అనేది తల్లిదండ్రులకు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే ప్లాట్‌ఫామ్. ప్రేమ ఒక్కటే చాలదు.. సరైన ఫ్రేమ్‌వర్క్ కావాలనేవి చెప్తారు. 1% కెరీర్ క్లబ్ ద్వారా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇస్తారు. విద్యార్థులు బలహీనులు కాదు.. కానీ తప్పు దిశలో నడుస్తున్నారు అని ఈ కార్యక్రమం రియలైజ్ అయ్యేలా చేస్తుంది. యూనీకనెక్ట్ అనేది.. సరైన కాలేజీ.. బ్రాంచ్.. కెరీర్ ఎంచుకోవడానికి ఇచ్చే 1:1 కౌన్సెలింగ్. ఇక డ్రీమ్ అహెడ్ పిన్‌కోడ్ ఫ్రాంచైజీ ద్వారా ఇండియాలోని మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సాహించే ప్రోగ్రామ్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భయాన్ని తొలగిస్తుందన్నమాట.






