Technology : ఆహార వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి.. ఫిలిప్సీన్స్ యువకుడి సరికొత్త ఆవిష్కరణ!

by Javid Pasha |

Technology : ఆహార వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి.. ఫిలిప్సీన్స్ యువకుడి సరికొత్త ఆవిష్కరణ!

Technology : ఆహార వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి.. ఫిలిప్సీన్స్ యువకుడి సరికొత్త ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : అడుగులు వేయడం ద్వారా, సైకిల్ తొక్కడం ద్వారా విద్యుత్ జనరేట్ చేసే టెక్నాలజీ గురించి మీరు వినే ఉంటారు. కానీ ఆహార వ్యర్థాలతో కూడా కరెంట్ ఉత్పత్తి అవుతుందనే విషయం మీకు తెలుసా? ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ క్వారీ ఎహ్రెన్ మైగ్యూ (Quarry Ehren Maigue) ఈ సరికొత్త ఆవిష్కరణకు తెరతీశాడు. ఫుడ్ వేస్టేజ్ నుంచి అతను డెవలప్ చేసిన AuREUS (Aurora Renewable Energy and UV Sequestration) అనే సోలార్ ప్యానెల్ వ్యవస్థ అతినీల లోహిత (UV) కాంతిని గ్రహించి, ప్రత్యక్ష సూర్యకాంతి లేకుండానే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సోలార్ ప్యానెల్స్ ఇప్పటికే ఉన్నాయి కదా అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. కానీ క్వారీ ఎహ్రెన్ మైగ్యూ అభివృద్ధి చేసిన సోలార్ ప్యానెల్ సాంప్రదాయ సోలార్ ప్యానెల్ వ్యవస్థకు భిన్నమైనది. ఇప్పటికే ఉన్న సాంప్రదాయ సోలార్ ప్యానెళ్లు నేరుగా సూర్యరశ్మికి గురికావడంవల్ల కేవలం కనిపించే కాంతిని గ్రహించి మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. కానీ క్వారీ ఎహ్రెన్ మైగ్యూ తయారు చేసిన AuREUS UV వ్యవస్థ సూర్యరశ్మికి గురికాకపోయినా, మేఘావృతమై ఉన్న వాతావరణంలోనూ దాదాపు 50% సమయం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఆవిష్కరణకు గాను మైగ్యూ 2020లో జేమ్స్ డైసన్ సస్టైనబిలిటీ అవార్డును గెలుచుకున్నాడు.

Source link

Next Story