- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

టెక్నాలజీని ఎంత వాడితే అంత పదునెక్కుతాయి ఆలోచనలు.
చాలామంది టెక్నాలజీని మంచికంటే చెడుకే వినియోగిస్తున్నారు.
అలాంటివారెవరున్నా..
ఒకసారి ఈ యువరైతును చూసి నేర్చుకోండి.
ఊళ్లో ఉంటూనే స్మార్ట్ ఐడియాతో.. స్మార్ట్ బిజినెస్ చేస్తున్నాడు.
వందల మందికి ఆసరా అవుతున్నాడు.
దిశ, ఫీచర్స్: మహారాష్ట్రలోని యువత్మాల్ జిల్లా మహాగావ్ పట్టణం. 2022 దీపావళి రోజున ఒక నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైంది. మార్కెట్లోని ఒక మూలలో.. స్థానిక యువరైతు సునీల్ నడిపే స్మార్ట్ కార్డుతో పనిచేసే మిల్క్ ఏటీఎం విదర్భ ప్రాంతంలో తొలిసారిగా నిలిచి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
24 ఎకరాల్లో..
రోజుకు 10 లీటర్ల పాశ్చరైజ్డ్ పాలతో ప్రారంభమైన ఈ స్మార్ట్ బిజినెస్ ఇప్పుడు రోజుకు 500 లీటర్లకు పైగా అమ్మకాలతో.. డోర్‌స్టెప్ డెలివరీ.. ఐస్క్రీమ్ పార్లర్‌తో విజయవంతమైన గ్రామీణ వ్యవస్థగా మారింది. వ్యవసాయం నిరాశ పరిచినప్పుడు రైతులకు ఈ మార్గం కొత్త ఆశలు చిగురింపజేసింది. మహాగావ్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలోని ఫుల్సాంగిలో సునీల్‌కు 24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ 24 ఎకరాల్లో చెరకు.. సోయాబీన్.. పత్తి పండించేవారు. కానీ ప్రతీ సంవత్సరం దిగుబడి తగ్గుతూ వచ్చి వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయారు.
డెయిరీ ఆలోచన
మహాగావ్ పరిసర ప్రాంతాల్లోని నేలల్లో సేంద్రీయ కర్బన తక్కువగా ఉంటుందట. ఆ కారణంగానే అక్కడి నేలలు నిస్సారమైపోయి పంటల దిగుబడి క్షీణిస్తూ వచ్చింది. రసాయన ఎరువులతో పాటు ఆవు పేడను వాడమని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అధికారులు సలహా ఇచ్చారు. కానీ అంత విస్తీర్ణంలో ఆవుపేడ వేయాలంటే తమ దగ్గర ఉన్న పేడ సరిపోదు. బయట తీసుకుందామని వెళ్తే రూ.2.5 లక్షలు అవుతుందని చెప్పారు. అంత పెద్దమొత్తం వెచ్చించి పేడను కొనుగోలు చేసే స్థోమత లేక పాలు.. సేంద్రీయ ఎరువు రెండింటినీ అందంచే శాశ్వత పరిష్కారంగా డెయిరీని ఎంచుకున్నాడు.
సొంతంగానే ప్రారంభం
ఐడియా బాగుంది. కానీ బ్యాంకులేవీ రుణం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇలా అయితే ఎలా అని ఆందోళన చెందిన సొంతంగా డెయిరీ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. తన సేవింగ్స్.. ఇంకా తన భార్య ఒంటిపై ఉన్న ఆభరణాలను తాకట్టు పెట్టి హర్యానాలోని హిసార్ నుంచి 16 ముర్రాజాతి బర్రెలను కొనుగోలు చేశాడు. వీటికి రూ.13.5 లక్షల ఖర్చు అయ్యింది. కోల్హాపూర్లో ఒక ఫామ్ నుంచి డెయిరీ శిక్షణ తీసుకున్నాడు. ప్రతీ బర్రె రోజుకు 10-12 లీటర్ల పాలిస్తుది. మొదట్లో ప్రైవేట్ సెంటర్లకు అమ్మిన.. తర్వాత సొంత డైరీని ప్రారంభించాడు.
అంతా స్మార్ట్ సిస్టమ్
రూ.5.5 లక్షలతో శాస్త్రీయంగా రూపొందించిన బర్రెల షెడ్‌ను నిర్మించాడు. శుభ్రమైన నీటి సౌకర్యం.. సిమెంట్ తొట్లు.. కూలింగ్ సిస్టమ్.. మిల్కింగ్ మెషీన్లు.. వ్యర్థ నిర్వహణ.. సీసీటీవీ సెక్యూరిటీ వంటి సౌకర్యాలు కల్పించాడు. నైపుణ్యంగల కార్మికులకు బర్రెల సంరక్షణ పేరుతో ఉపాధి కల్పించాడు. మొక్కజొన్న.. సూపర్ నేపియర్.. మెగా స్వీట్ వంటి ఆధునిక దిగుబడి గల మేత.. ఖనిజాలు.. కాల్షియం సప్లిమెంట్స్ ఉన్న ఆహారాన్ని ఇచ్చాడు. పాలతో వచ్చే సంపాదనతో పాటు.. 70-80 ఆవుపేడను సేకరించి దానిని వ్యవసాయానికి వినియోగిస్తున్నాడు.
మిల్క్ ఏటీఎం
పుణె.. నాసిక్ లోని మిల్క్ డిస్పెన్సర్ల స్ఫూర్తితో సునీల్ రూ.2.5 లక్షలతో 150 లీటర్ల సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్ మిల్క్ ఏటీఎంను ఏర్పాటు చేశాడు. 4°C వద్ద పాలను చల్లగా ఉంచే ఈ యత్రం స్మార్ట్ కార్డ్.. క్యూఆర్ కోడ్ల ద్వారా సర్వీస్ అందిస్తోంది. కస్టమర్లు తమ సొంత కంటైనర్లు లేదా ప్లాస్టిక్ బ్యాగులతో పాలను సేకరిస్తారు. వందల సంఖ్యలో కస్టమర్లు అయ్యారు. వీరందరికీ రూ.200 విలువైన రీచార్జబుల్ స్మార్ట్ కార్డులను ఇచ్చి జనాలకు కొత్త మెథడ్‌ను అలవాటు చేశాడు. 6.5 శాతం ఫ్యాట్‌కంటెంట్‌తో కూడిన అధిక నాణ్యతగల పాలు నమ్మకమైన కస్టమర్ బేస్‌ను సంపాదించి పెడుతున్నాయి.
ఐస్ క్రీమ్ కూడా..
సునీల్ కేవలం పచ్చి పాలతో ఆగలేదు. పన్నీర్.. పెరుగు.. మజ్జిగ.. నెయ్యిన ఉత్పత్తి చేస్తూ సరసమైన ధరలకు వినియోగిస్తున్నారు. ఏటీఎం పక్కనే ఐస్‌క్రీమ్ పార్లర్ కూడా ప్రారంభించాడు. త్వరలో ఇంకో 15 బర్రెలను తీసుకొచ్చి 1000 లీటర్ల పాల అమ్మకాలను పెంచాలనుకుంటున్నాడు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ దృఢ సంకల్పం.. స్వావలంబన.. గ్రామీణ ఆవిష్కరణతో సునీల్ సక్సెస్ అయ్యాడు. యువత్మాల్‌లో ఆయన పెట్టింది డెయిరీ మాత్రమే కాదు. యువతకు సమ్మకం.. సందేశం.. గౌరవంతో స్పూర్తినిచ్చే విజయాన్ని పరిచయం చేశాడు.






