- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : సెల్ఫీ కావాలా నాయనా..! దానికి ఒప్పుకుంటేనే ఇస్తా!!
Viral video : సెల్ఫీ కావాలా నాయనా..! దానికి ఒప్పుకుంటేనే ఇస్తా!!

దిశ, ఫీచర్స్ : సెలబ్రిటీ కనిపిస్తే చాలు సెల్ఫీ దిగాలనే తాపత్రయం చాలామందికి ఉంటుంది. ఏ మాత్రం చాన్స్ దొరికినా తమ అభిమాన నటీ నటులతో, ప్రముఖులతో, అతిథులతో ఒక ఫొటో తీసుకుందామని ఆరాట పడుతుంటారు పలువురు. అయితే ఈ సరదా అక్కడికే పరిమితం కాలేదు. కాదేదీ సెల్ఫీకి అనర్హమన్నట్లు అందమైన లొకేషన్, ఆకట్టుకునే డెస్టినేషన్, అక్కడికొచ్చిన అతిథులు ఇలా.. ప్రతీ సందర్భాన్ని, ప్రతీ సన్నివేశాన్ని సెల్ఫీలు దిగడానికి యూజ్ చేసుకునేవారు చాలా మందే ఉంటున్నారు. కొన్నిసార్లు ఈ సెల్ఫీల సరదా ఇబ్బందిగా మారుతున్నా, ప్రమాదాలకు కారణమవుతున్నా యూత్‌లో క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. అలాంటి సిచువేషన్‌ను కళ్లకు కడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెరైటీ ఏంటంటే.. సెల్ఫీల గోల భరించలేక ఓ యువతి పెట్టిన సరికొత్త కండిషన్ అందరినీ ఆలోచింపజేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.
వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. భారతదేశ పర్యటనకు వచ్చిన ఓ రష్యన్ మహిళతో సెల్ఫీలు దిగడానికి జనాలు ఎగబడుతున్నారు. ‘మేడమ్ ప్లీజ్ వన్ సెల్ఫీ’ అంటూ ఆమె వెంటపడుతున్నారు. ఈ సెల్ఫీల గోల కాస్త తనకు ఇబ్బందిగా మారడంతో సదరు మహిళ ఓ కండిషన్ పెట్టింది. దానికి ఒప్పుకుంటేనే ఇస్తానని స్పష్టం చేసింది. ఏంటంటే.. తనతో సెల్ఫీ దిగాలంటే.. ఒక్క సెల్ఫీకి రూ. 100 ఇవ్వాలని చెప్పడంతోపాటు అందుకు సంబంధించిన ప్లకార్డు కూడా ప్రదర్శించింది. అయితేనేం.. ఆమెతో సెల్ఫీలు దిగడానికే జనాలు ఆసక్తి చూపుతున్నారు. వంద తీసుకున్నా సరే మాకు సెల్ఫీ కావాలంటూ ఎగబడుతున్నారు. ఇంకేముంది మనోళ్ల సెల్ఫీల సరదా తీరడంతోపాటు, ఫొటోలకు ఫోజులిచ్చిన మహిళ కూడా తన వెరైటీ ఐడియాను క్యాష్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లతో రష్యన్ మహిళకు వచ్చిన ఐడియాను ప్రశంసిస్తున్నారు.
video credits to @angelinali777 Insta handle






