- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending : యంగ్ ఏజ్‌లోనే వెంటాడుతున్న ఆ సమస్య.. 90% మంది పరిస్థితి ఇదే!
Trending : యంగ్ ఏజ్‌లోనే వెంటాడుతున్న ఆ సమస్య.. 90% మంది పరిస్థితి ఇదే!

దిశ, ఫీచర్స్: ‘యంగ్ ఏజ్ అంటేనే ఉడుకు రక్తం. ఉత్సాహం ఎక్కువ’ అంటుంటారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో అది అందరికీ వర్తించకపోవచ్చు అంటున్నారు కొందరు. ఎందుకంటే చదువు, కెరీర్, బతుకు దెరువు ఆరాటంలో పడి ఆనందాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతున్నవారు క్రమంగా పెరిగిపోతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్‌లో అయితే 25 ఏండ్లలోపు ఉద్యోగుల్లో 90 శాతం మంది స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీస్‌లతో సంతోషంగా ఉండలేకపోతున్నారని ‘‘Employee Assistance Programme (EAP) service provider, 1to1help’’ రిపోర్ట్ పేర్కొన్నది. ‘స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ రిపోర్ట్ 2024’ పేరుతో ఆ సంస్థ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం.. యువతతోపాటు 45 ఏండ్లు పైబడిన వారిలో 67 శాతం మంది అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఒకప్పటిలా నేటి యువతరం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే పరిస్థితులు కనబడట్లేదని నివేదికను ఎనలైజ్ చేసిన నిపుణులు అంటున్నారు. చదువు, ఉద్యోగం, కెరీర్ వంటి లక్ష్యాలవెంట పరుగెడుతూ యంగ్‌స్టర్స్ అసలైన ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తోందని చెబుతున్నారు. కార్పొరేట్ సెక్టార్‌లోనే ఇలాంటి సిచువేషన్ అధికంగా ఉండటంతో యంగ్ ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ స్ట్రెస్ కారణంగా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోలేక ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. రీసెంట్ నివేదిక ప్రకారం.. 2024 జనవరి నుంచి నవంబర్ మధ్య వరకు 83 వేల కౌన్సెలింగ్ సెషన్స్‌ను, 12 వేల స్క్రీనింగ్స్, 42 వేల అసెస్‌మెంట్స్ డేటాను విశ్లేషించిన నిపుణులు, 45 ఏండ్ల వారితో పోలిస్తే 25 ఏండ్లలోపు యువ ఉద్యోగుల్లోనే స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ లక్షణాలు అధికంగా ఉంటున్నాయని కనుగొన్నారు. దీంతో వీరు లవ్, రిలేషన్‌షిప్, ఫ్యామిలీ వంటి అంశాలపై ఫోకస్ చేయలేకపోతున్నారని, చేసినా సమస్యలతో సతమతం అవుతున్నారని గుర్తించారు.
కాగా నివేదిక ప్రకారం.. 2024లో అన్ని సెషన్లలో 15 శాతం స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలే అధికంగా కనిపించాయి. కౌన్సెలింగ్ షెషన్లలో 23 శాతం వరకు వర్క్‌ప్లేస్ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇక సెల్ఫ్ డెవలప్‌మెంట్, మానసిక సమస్యలు, సంబంధాల్లో ఇబ్బందులు వంటివి కౌన్సెలింగ్ సహాయం కోరడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే.. స్ట్రెస్, యాంగ్జైటీస్ మూలంగా 2023లో సూసైడ్ రిస్క్ 19 శాతం ఉంటే, 2024లో 22 శాతానికి పెరిగింది. కార్పొరేట్ సెక్టార్‌లోని కొంతమంది వ్యక్తుల్లో సెల్ఫ్ హార్మ్ సంకేతాలు కనిపించాయని నివేదిక పేర్కొన్నది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు






